Share News

అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:03 PM

పేద ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
శేరిపల్లిలో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మఽధుసూదన్‌రెడ్డి

ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

భూత్పూర్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శేరిపల్లి, హస్నాపూర్‌, భట్టుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. గ్రామాల్లో చాలా ఏళ్లుగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో చూసి చలించిపోయారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు భట్టుపల్లి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మానానికి భూమిపూజ చేశారు. కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటనర్సిహ్మారెడ్డి, మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్‌, మాజీ సర్పంచులు నాగిరెడ్డి, హర్యానాయక్‌, సంజీవరెడ్డి, కొండన్న, తిరుపతయ్య, హస్నాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు తిరుపతయ్య, మలిశెట్టి వెంకటేష్‌, తాటికొండ రవీందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, టీచర్‌ రవినాయక్‌, హేమ్లానాయక్‌, ఎంపీడీవో ప్రభాకర్‌చారి పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 11:03 PM