Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:14 PM

క్రీడలు దేహ ధారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- లోకుర్తిలో ఎల్‌పీఎల్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభం

దామరగిద్ద, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): క్రీడలు దేహ ధారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని శనివారం మండల పరిధిలోని లోకుర్తి గ్రామంలో లోకుర్తి ప్రీమియం లీగ్‌ క్రికెట్‌ పోటీలను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. క్రీడా పోటీల్లో 6 జట్లు పాల్గొన్నాయి. సాయి కిరణ్‌, రాజు, టి.నారాయణరెడ్డి, సుదర్శన్‌, రాచప్ప పాల్గొన్నారు.

బిర్రులాగుడు పోటీలను తిలకించిన ఎమ్మెల్యే

దామరగిద్ద మండలంలోని ఎల్సాన్‌పల్లి గ్రామంలో ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండి బిర్రులాగుడు పోటీలను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తిలకించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5 తులాల వెండి, రెండవ బహుమతి రెండున్నర తులాల వెండి బహుకరించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, విండో చైర్మన్‌ పుట్టి ఈదప్ప, మాజీ సర్పంచు దేవిక పరిపూర్ణం, మాజీ ఉపసర్పంచు సాయిరాం, కాంగ్రెస్‌ నాయకుడు రాజు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

వీధి నాటకం కరపత్రం ఆవిష్కరణ

ధన్వాడ : మండల కేంద్రంలో నిర్వహించ నున్న చెన్నకేశవస్వామి జీవిత చరిత్ర వీధి నాటకం కరపత్రాన్ని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి శనివారం ఆవిష్కరించారు. వచ్చేనెల తొమ్మిదో తేదీన స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో వీధి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. నాటకానికి రావాలని నిర్వాహకులు ఎమ్మెల్యేను కోరారు. కార్య క్రమంలో బాలకిష్టి, ఊట్కుర్‌ రాములు, కొండప్ప, చెన్నప్ప, రమేష్‌, వెంకటప్ప తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:14 PM