Share News

శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:41 PM

రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్ర భాకర్‌ విమర్శించారు.

శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలం

- హెచ్‌సీయూ భూముల వ్యవహారం డైవర్షన్‌ పాలిటిక్స్‌

- బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్ర భాకర్‌ విమర్శించారు. హోంశాఖను తన వ ద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే మహిళలకు అఘాయిత్యా లు జరగడం శోచనీయన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఈ నెల 26న బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మహనీయుల జాతర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పా ర్టీ అధికారంలోకి వచ్చాక బహుజన మహిళ లపై అఘాయిత్యాల జరడం ఆందోళనకర మన్నారు. యువత గంజాయికి అలవాటు పడి మహిళలపై దారుణాలకు ఒడిగడుతు న్నారని, శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్ర భుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్ర శ్నించారు. ఇటీవల షాద్‌నగర్‌లో దళిత మ హిళ, కొల్లాపూర్‌లో గిరిజన మహిళలపై అ ఘాయిత్యాలు జరుగగా, తాజాగా ఊర్కొండ పేటలో బీసీ మహిళపై లైంగిక దాడి జరి గిందని తెలిపారు. చివరకు పుణ్యక్షేత్రాల వద్ద కూడా ప్రజలకు భద్రత కరువైందన్నా రు. మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి మరోమారు ఇలాంటివి కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడు స్తున్నాయని, బీసీ రిజర్వేషన్లపై బహుజను లు ఉద్యమానికి సిద్ధమైన వేళ హెచ్‌సీ యూ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం చర్చలోకి తీసుకొచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉం టే అది నాయకత్వంతో పార్లమెంట్‌లో మా ట్లాడించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో నిషానీ రామచంద్ర, దాగిళ్ల దయా నంద్‌రావు, శివరామకృష్ణ, చంద్రశేఖర్‌, గుం డెల ధర్మేందర్‌, అంతటి నాగన్న, పృథ్వీరాజ్‌, రాంచందర్‌, హర్ష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:41 PM