Share News

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 10:58 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్‌కార్డు లబ్ధి దారులందరు వినియోగించుకోవా లని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి
పేట మండలం తిర్మలాపూర్‌లో తహసీల్దార్‌ అమరేంద్రకృష్ణతో కలిసి బియ్యం పంపిణీ చేస్తున్న మార్కెట్‌ చైర్మన్‌ సదాశివారెడ్డి

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేట టౌన్‌/ నారాయణపేట రూరల్‌/కొత్తపల్లి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్‌కార్డు లబ్ధి దారులందరు వినియోగించుకోవా లని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం పేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని 4వ చౌక ధర దుకాణంలో కలెక్టర్‌ సన్న బి య్యం పథకాన్ని ప్రారంభించి, పార్వతమ్మ అనే కార్డుదారురాలికి 18 కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ చరిత్రలో ఎన్నడులేని విధంగా ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూర్యాపేటలో మొదటగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అందరి ఆరోగ్యం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. జిల్లాలో డైనమిక్‌ రిజిస్టర్‌ ఆధారంగా అర్హులందరికి సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. తహసీల్దార్‌ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎస్‌ఐ కుర్మయ్య, ఎంపీవో, రేషన్‌ దుకాణం డీలర్‌ జలంధర్‌ తది తరులున్నారు.

అదేవిధంగా, పేట మండలం తిర్మలాపూర్‌, కోటకొండ గ్రామాల్లో తహసీల్దార్‌ అమరేంద్రకృష్ణతో కలిసి పేట మార్కెట్‌ చైర్మన్‌ రాంపురం సదాశివారెడ్డి గురువారం సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదాశివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపేందుకే రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని అన్నారు. కార్యక్రమాల్లో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, సుధాకర్‌బాబు, రాజిరెడ్డి, మాజీ సర్పంచ్‌ జయలక్ష్మి, ప్రభంజన్‌రావు తదితరులున్నారు.

కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో గురువారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీవో రాంచందర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం అమ్మితే రేషన్‌కార్డు రద్దు చేసి క్రిమినల్‌ కేసు పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఆనంద్‌, రెవెన్యూ సిబ్బంది, ఉమ్మడి మద్దూర్‌ మండల పీఏసీఎస్‌ అధ్యక్షుడు గూళ్ల నర్సింహులు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, కోస్గి మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు ముద్ది భీములు, కోట్ల మహేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, రేషన్‌ డీలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 10:58 PM