Mahesh Kumar Goud: ఏడాదిలోనే రూ. 2,19,182 కోట్లు
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:10 AM
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పె ట్టుబడులు కేవలం రూ.25,750 కోట్లు మాత్రమేనని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ అ న్నారు. తమ ఏడాది పాలనలో ఏకంగా రూ.2,19,182 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.

దావోస్ సదస్సు నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులివి
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెచ్చింది రూ.25,750కోట్లే
చర్చకు సిద్ధమా?: మహేశ్‌గౌడ్
హైదరాబాద్/మోత్కూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పె ట్టుబడులు కేవలం రూ.25,750 కోట్లు మాత్రమేనని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ అ న్నారు. తమ ఏడాది పాలనలో ఏకంగా రూ.2,19,182 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దీనిపైన చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ నుంచి తాను, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు వస్తామని, బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్‌ను తీసుకొచ్చుకుంటారో.. లేకుంటే ఇంకెవరైనా ఎక్స్‌పర్ట్‌ను తీసుకొచ్చుకుంటారో కేటీఆర్ ఇష్టమని అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో 2019 వరకూ వచ్చిన పెట్టుబడులు సున్నా అని చెప్పారు. 2020లో రూ.500 కోట్లు, 2022లో రూ.4,250 కోట్లు, 2023లో రూ.21 వేల కోట్లు.. వెరసి పదేళ్లలో కేవలం రూ.25,750 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయన్నారు. అదే కాంగ్రెస్ ఏడాది పాలనలో.. 2024 జనవరిలో జరిగిన దావోస్ సదస్సులో రూ.40,232 కోట్లు, తాజా సదస్సులో రూ.1,78,950 కోట్ల మేరకు వివిధ కంపెనీలతో పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారితో దావో్‌సలోని తెలంగాణ పెవిలియన్ వద్ద రద్దీ ఏర్పడిందని చెప్పా రు. దావో్‌సలో కుదిరిన ఒప్పందాలతో రాష్ట్రంలో దాదాపు 75 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలో రియల్ బూమ్ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలుపుతోందని ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. గ్రామ సభల్లో అర్హులైన లబ్ధిదారులను పార్టీలకు అతీతంగా ఎంపిక చేస్తున్నారని ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలే చేసేవారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై తాను నియమించిన ద్విసభ్య కమిటీ పరిశీలన చేస్తోందని, కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని వెల్లడించారు.
కాగా, సీఎం రేవంత్ రాష్ట్రానికి రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు కేటీఆర్‌కు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులకు కడుపు మంటగా ఉంటే ఈనో తాగాలని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయొద్దని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలే దని విమర్శించారు. కాగా, కేసీఆర్, కేటీఆర్ కడుపు మంట తగ్గాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఈనో ప్యాకెట్లను కొరియర్ చేశారు. కాగా, గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఘర్షణ నేపథ్యంలో కొత్తగూడెం జిల్లాకు చెందిన ఐదుగురు నాయకులకు షోకాజ్ నోటీసు జారీ అయింది. అలాగే, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 42 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం