Share News

MLC Elections 2025: వేలకు వేలు చెల్లని ఓట్లు.. అసలు వీళ్లను ఏమనాలి

ABN , Publish Date - Mar 04 , 2025 | 09:48 AM

MLC Elections Results 2025: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. భారీ మొత్తంలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.

MLC Elections 2025: వేలకు వేలు చెల్లని ఓట్లు.. అసలు వీళ్లను ఏమనాలి
MLC Elections 2025

మన దేశంలో ఎన్నికలను ఓ పండుగలా చూస్తారు. భవిష్యత్తు నిర్మాణానికి మంచి నాయకులను ఎన్నుకోవడం కీలకమని నమ్ముతారు. అందుకే ఊరూ వాడా అందరూ దండుగా కదిలొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులు కూడా ఓటు ఎలా వేయాలో తెలుసుకొని మరీ తమ హక్కును కాపాడుకుంటారు. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేస్తుంటారు. అయితే నిరక్షరాస్యులు ఇంత సులువుగా చేసిన పని గ్రాడ్యుయేట్లు చేయలేకపోతున్నారు. సరిగ్గా ఓటు వేయకుండా గందరగోళం నెలకొనేలా చేస్తున్నారు. తాజా గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలే దీనికి అతిపెద్ద ఉదాహరణ.


ఓటు వేయడం రాదా..

ఉభయ రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో వేలకు వేలు చెల్లని ఓట్లు నమోదయ్యాయని తెలుస్తోంది. మొత్తం 2 లక్షల 50 వేల ఓట్లు పోలైతే.. అందులో దాదాపుగా 40 వేల ఓట్ల పైచిలుకు చెల్లనివిగా తేలాయని సమాచారం. దీంతో అంతా షాక్ అవుతున్నారు. పట్టభద్రులై ఉండి ఓట్లు సరిగ్గా వేయకపోవడం ఏంటని బిత్తరపోతున్నారు. ఇన్ని చదువులు చదువుకొని కనీసం ఓటు కూడా కరెక్ట్‌గా వేయడం లేదు.. ఇన్ని వేల ఓట్లు చెల్లకపోవడం ఏంటని విస్మయానికి లోనవుతున్నారు.


మంత్రి షాక్

చెల్లని ఓట్లు భారీగా కావడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. అధికారుల అలసత్వమే దీనికి కారణమని.. ఓటు అవేర్నెస్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఓటర్లు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయని అంటున్నారు. ఈ విషయంపై ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్ల గురించి తెలుసుకొని ఆయన షాక్ అయ్యారు. చదువుకున్న వారికి ఓటు ఎలా వేయాలో కూడా తెలియకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.


అవగాహన లోపం

చెల్లని ఓట్లలో చాలా మటుకు అవేర్నెస్ లేకపోవడం వల్లే నమోదయ్యాయని తెలుస్తోంది. పట్టభద్రుల అవగాహన లోపంతో ఎక్కువగా చెల్లని ఓట్లు నమోదయ్యాయని వినిపిస్తోంది. కొందరు బ్యాలెట్ పేపర్ల మీద రైట్ గుర్తుపెట్టగా.. ఇంకొందరు బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేశారు. చెల్లని ఓట్ల ఇష్యూ వల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లేట్ అవుతోందని సమాచారం. ఫలితాల్లో ఒక్కో ఓటు కీలకమైన నేపథ్యంలో ఏకంగా వేలకు వేలు ఓట్లు చెల్లనివిగా తేలడంతో అభ్యర్థులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చదువుకున్న వారు కనీసం ఓటు సరిగ్గా వేయకపోవడం ఏంటి.. అసలు వీళ్లను ఏమనాలి అంటూ ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.


ఇవీ చదవండి:

నర్సింగ్‌ కౌన్సిల్‌.. పైసా వసూల్‌

తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..

తేల్చి చెప్పేశారు.. ఆదివారం ఆఖరు..

మరిన్ని తెలంగాణ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2025 | 09:57 AM