Share News

ఏటీసీలతో ఉపాధి భరోసా!

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:40 AM

టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) రానున్న విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు తక్షణ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌)లలో ఈ ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నారు.

ఏటీసీలతో ఉపాధి భరోసా!

ఉమ్మడి జిల్లాలో ఏడు ఐటీఐలలో ఏర్పాటు

పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు తీసుకున్న టాటా టెక్నాలజీ లిమిటెడ్‌

ఇంటర్‌స్థాయిలోనే విద్యార్ధులకు తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఛాన్స్‌

ఏటీసీలలో ఆరురకాల ఆధునిక కోర్సులు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) రానున్న విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు తక్షణ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌)లలో ఈ ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ (బాయ్స్‌), నల్లగొం డ (గర్ల్స్‌) ఐటీఐలతో పాటు,అనుముల,డిండి, హుజూర్‌నగర్‌, ఆలేరు, భువనగిరిలోని ఐటీఐలలో వీటిని నిర్మిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏటీసీలకు సంబంధిం చి ఇప్పటికే భవనాల నిర్మాణాలు దాదాపు పూర్తికాగా, ల్యాబ్‌లు, కంప్యూటర్లు, వర్క్‌షాపులు, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, ఇత ర సామగ్రి, బోధనోపకరణాలు, ఇతర పనులు వేగవంతం గా సాగుతున్నాయి. నల్లగొండలోని బాయ్స్‌ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీని ఈ నెలలో ప్రారంభించాలని అధికారు లు నిర్ణయించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను నెలకొల్పుతుండగా, మే నెలాఖరు నాటికి అన్ని ఏటీసీలు సిద్ధమవుతాయని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారు లు చెబుతున్నా రు. ప్రతి ఏటీసీలో ఆరు ఆధునిక కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సుల్లో శిక్షణ పూర్తయ్యాక టీటీఎల్‌ సహా అరబ్‌ దేశాలు, దేశీ య ఐటీ,సాఫ్ట్‌వేర్‌,హార్డ్‌వేర్‌ కంపెనీల్లో తక్షణం ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా ఏటీసీలే తీసుకుంటాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక కోర్సుల ద్వారా ఏటా 5,860 మంది, స్వల్పకాలిక కోర్సుల ద్వారా 31,200 మందికి ఈ ఏటీసీల్లో శిక్షణ ఇవ్వనుండగా, ఉమ్మడి జిల్లాలో దీర్ఘకాలిక కోర్సుల ద్వారా ఏటా 854 మందికి, స్వల్పకాలిక కోర్సుల ద్వారా 3,360 మందికి శిక్షణ అందనుంది.

రూ.34కోట్లతో నిర్మాణాలు

టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మిస్తున్న ఈ ఏటీసీల నిర్వహణను పదేళ్ల పాటు టీటీఎల్‌ సంస్థనే చూడనుంది. ఏటీసీల ఏర్పాటులోనూ టీటీఎల్‌ సంస్థ 86.74శాతం వ్యయాన్ని భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 13.26శాతం ఖర్చు చేస్తోంది. ఒక్కో ఏటీసీకి సగటున రూ.34కోట్ల వరకు నిధులు కేటాయించారు. వీటిద్వారా వచ్చే పదేళ్లలో 4లక్షల మందికి ఉపాధి, ఉద్యోగకల్పన నిమిత్తం శిక్షణ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొల్పుతున్న ఏడు ఏటీసీలలో ఇప్పటికే భవనాల నిర్మాణాలు పూర్తవగా, ల్యాబ్‌లు, వర్క్‌షాపులు, ఇతర బోధనోపకరణాల ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. ప్రతీ ఏటీసీలో కోర్సుకు ఇద్దరు చొప్పున మొత్తం 12మంది ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 84మంది ఇన్‌స్ట్రక్టర్లను టీటీఎల్‌ సంస్థనే నియమించి, వారికి వేతనాలు అందిస్తుంది. వీరిలో ప్రతీ ఏటీసీకి ఇద్దరు చొప్పున ఇన్‌స్ట్రక్టర్లను ఇప్పటికే టీటీఎల్‌ నియమించిందని, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి మిగిలినవారిని నియమిస్తారని అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రతీ ఏటీసీలో కనీసం నలుగురు చొప్పున నాన్‌టెక్నికల్‌ సిబ్బందిని నియమించే అవకాశం ఉంది. ఏటీసీలలో ఆరు దీర్ఘకాలిక కోర్సులు ప్రవేశపెడుతున్నారు. అందులో మూడు కోర్సులకు ఏడాది కాలవ్యవధి ఉంటే, మరో మూడు కోర్సులు రెండేళ్ల కాలవ్యవధిలో పూర్తవుతాయి. ప్రతీ ఏటీసీలో ఆరు కోర్సుల్లో ఏటా 122 మంది విద్యార్థులకు శిక్షణ అందుతుంది.

ఏటీసీల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి: నరసింహచారి, ఉమ్మడి జిల్లా ఐటీసీల కన్వీనర్‌

ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రభుత్వ ఐటీఐల వద్ద నిర్మిస్తు న్న ఏటీసీ భవనాల పనులు దాదాపు పూర్తయ్యాయి. వాటిల్లో ఏర్పాటు చేయాల్సిన సామగ్రి కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. నల్లగొండలో బాయ్స్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేస్తున్న ఏటీసీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆరు ఏటీసీలలో కూడా నిర్మాణాలు దాదాపు చివరిదశకు వచ్చాయి. అన్నింటిలోనూ 2005-26 విద్యాసంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేందు కు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నిర్వహించే కోర్సులు ఆధునిక ప్రపంచంలో తక్షణం ఉపాధి, ఉద్యోగం పొందేందుకు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇంటర్‌ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగం, ఉపాధి పొందేందుకు ఇవి దోహదపడతాయి.

ఉమ్మడి జిల్లాలోని ఏటీసీలలో ప్రవేశపెట్టే కోర్సులు ఇలా..

కోర్సు కాలవ్యవధి ఒక్కో కేంద్రంలో

సీట్ల సంఖ్య

అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మెషినింగ్‌ టెక్నీషియన్‌ రెండేళ్లు 24

ఆర్టిఫీషియన్‌ యూసింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌ ఏడాది 10

బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌ (మెకానికల్‌) రెండేళ్లు 24

ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌ ఏడాది 20

ఎలక్ట్రికల్‌ వెహికిల్‌ మెకానిక్‌ రెండేళ్లు 24

మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌ ఏడాది 20

Updated Date - Apr 15 , 2025 | 12:40 AM