Share News

ట్రాన్సకో సేవలు స్మార్ట్‌గా...

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:41 AM

ఇంటి నుంచి కాలు కదపకుండా స్మార్ట్‌ఫోన ద్వారానే సేవలు పొందేలా ట్రాన్సకో తన యాప్‌ను ఆధునికీకరించింది.

 ట్రాన్సకో సేవలు స్మార్ట్‌గా...

ఇంటి నుంచి కాలు కదపకుండా స్మార్ట్‌ఫోన ద్వారానే సేవలు పొందేలా ట్రాన్సకో తన యాప్‌ను ఆధునికీకరించింది. కొత్త కనెక్షన నుంచి ఫిర్యాదుల దాకా అన్ని స్మార్ట్‌ఫోన ద్వారా పొందేలా టీజీఎ్‌సపీడీసీఎల్‌ యాప్‌ రూపుదిద్దారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థ విరివిగా వినియోగించుకుంటోంది. సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ స్వీయ పర్యవేక్షణలో అప్డేటెడ్‌ వెర్షనలో ఈ యాప్‌ను విస్తృతంగా వాడుకలోకి తీసుకువచ్చారు.

- (ఆంధ్రజ్యోతి-నల్లగొండ టౌన)

వినియోగదారులకు పలు సేవలందించేందుకు 2024లో దక్షిణ తెలంగాణ విద్యుత పంపిణీ సంస్థ(టీజీఎ్‌సపీడీసీఎల్‌) యాప్‌ను అందుబాటులోకి తీసు కువచ్చింది. అయితే అందులో సేవలు పరిమితం కావడం,తరుచూ బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు విధిస్తుండటంతో వినియోగదారులు యాప్‌ను వినియోగించలేదు. మారుతున్న కాలానికనుగుణంగా యా ప్‌ను సంస్థ ఆధునికీకరించింది. సుమారు 20 రకాల సేవలను టీజీఎ్‌సపీడీసీఎల్‌ యాప్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి టీజీఎ్‌సపీడీసీఎల్‌ యాప్‌ అని డౌనలోడ్‌ చేసుకున్న తర్వాత యూఎస్సీ(యూనిక్‌ నెంబరు ఇన ఎలకి్ట్రసిటీ) నంబరు నమోదు చేయడం ద్వారా అన్నిరకాల సేవలను పొందేలా దీన్ని రూపొందించారు.

యాప్‌ నుంచే ఫిర్యాదులు...

విద్యుత సరఫరాలో అంతరాయం తలెత్తినా ఎక్కడైనా విద్యుత చౌర్యం జరిగినట్లు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. విద్యుత చార్జీలకు సం బంధించిన టారీఫ్‌ వివరాలు, భద్రతకు సంబంధించిన సూచనలను ఈ యాప్‌ నుంచే సులభంగా పొందేలా ఆధునికీకరించారు. సంస్థ పరిధిలో దాదా పు 10లక్షల మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకొని వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. మొత్తంగా అరచేతిలోనే విద్యుతరంగ సమగ్ర సమాచారం, సేవలను పొందేలా ఈ యాప్‌ను రూపొందించారు. స్మార్ట్‌ఫోన యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లలోనూ ఆనలైన సేవలను సులభంగా పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

జీపీఎస్‌ విధానం ద్వారా...

విద్యుత శాఖకు సంబంధించి ఎక్కడ ఏదైనా ఘటన జరిగినా యాప్‌లోని జీపీఎస్‌ లోకేషన ద్వారా వినియోగదారుడు ఫొన్లో ఫొటో తీసి పంపవచ్చు. దీంతో ఇందుకు సంబంధించిన రిపోర్టు నేరుగా సంబంధిత అధికారికి చేరుతుంది. వారు స్పందించి పరిష్కరిస్తారు.

న్యూ కనెక్షన

విద్యుతకనెక్షన కావాలనుకునే వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు ఇందులో ఉంటాయి.

పేరు, లోడ్‌ మార్పు : విద్యుత మీటర్‌ పేరు మార్చడానికి ఏంచేయాలనే వివరాలు, లోడ్‌ వివరాలు ఉంటాయి. దీని ప్రకారం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

పవర్‌ కంజెప్షన గైడ్‌లైన్స : విద్యుత ఉపకరణాలు, ఆ అవసరానికి ఎంత విద్యుత వినియోగం అవుతుందనే వివరాలు ఉంటాయి.

టారీఫ్‌ వివరాలు: విద్యుత వినియోగ చార్జీ లు కేటగిరీల వారీగా ఉంటాయి.

ఎనర్జీ సేవింగ్‌ టిప్స్‌:విద్యుత పొదుపు చే యడానికి తీసుకోవాల్సిన సూచనలు ఉంటాయి.

సేఫ్టీ టిప్స్‌ : విద్యుత ప్రమాదాలు జరగకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి.

ఫీడ్‌ బ్యాక్‌ : సంస్థ అందిస్తున్న సేవల గురిం చి వినియోగదారులు తమ అభిప్రాయాలు తెలపవచ్చు.

మై అకౌంట్‌ : విద్యుత వినియోగదారుల పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి.

కాంటాక్ట్‌ యాజ్‌ : ఇందులో 24 గంటలు పనిచేసే టోల్‌ ఫ్రీ నంబర్లు ఉంటాయి. 1912, సమస్యలను తెలియజేయవచ్చు. వీటితో పా టు వినియోగదారుల పరిధిలోని అధికారుల వివరాలు, బిల్లులకు సంబంధించిన సమాచారం వివరాలను యాప్‌లో తెలుసుకోవచ్చని విద్యుత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

వినియోగదారుడు తన సమస్యలను నేరుగా ఇందులో తెలియజేయవచ్చు. మీటరు నంబరు, సమస్యల వివరాలు నమోదు చేస్తే అధికారులు పరిష్కరిస్తారు. ఫిర్యాదు స్టేట్‌సను చూసే అవకాశం ఉండగా, పరిష్కారం విషయంలో సంతృప్తి చెందకపోతే తిరిగి ఫిర్యాదు చేయవచ్చు

సెల్ఫ్‌రీడింగ్‌: వినియోగదారులు తమ మీ టరుకు సెల్ఫ్‌రీడింగ్‌ తీసుకుని పంపించవ చ్చు. దీని ప్రకారం బిల్లులు జారీ అవుతాయి.

పే బిల్స్‌ : సర్వీస్‌ నంబరు నమోదు చేసుకు ని ప్రతినెలా తమ విద్యుత బిల్లులను ఇందులో చెల్లించవచ్చు.

బిల్‌ హిస్టరీ : తాము ఇప్పటి వరకు చెల్లించిన బిల్లుల వివరాలను పొందవచ్చు.

ఆనలైన పేమెంట్‌ హిస్టరీ : ఆనలైన ద్వారా చెల్లించిన బిల్లుల వివరాలను చూసుకునే అవకాశం ఉంది.

లింక్‌ ఆధార్‌, మొబైల్‌ : వినియోగదారులు తమ ఆధార్‌, మొబైల్‌ నంబర్లను లింక్‌ చేసుకోవచ్చు. దీంతో ప్రతినెలా బిల్లులకు సంబంధించిన సమాచారం మెసేజ్‌ వస్తుంది.

డొమెస్టిక్‌ బిల్‌ క్యాలిక్యూలేటర్‌ : వినియోగాదారులు నెల వారి విద్యుత వినియోగానికి సంబంధించిన మీటర్‌ రీడింగ్‌ వివరాలు పొందుపరిస్తే బిల్లు వివరాలను చూసుకునే అవకాశం ఉంది.

Updated Date - Apr 10 , 2025 | 12:41 AM