Share News

MLC Election: నేడు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:33 AM

పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటీవల ఎన్నికైన అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

MLC Election: నేడు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటీవల ఎన్నికైన అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు.


ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలిచారు. సోమవారం శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వీరితో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దాసోజు శ్రవణ్‌ మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 07 , 2025 | 05:33 AM