CM Revanth Met PM Modi : సీఎంకు పెద్ద లిస్ట్ ఇచ్చిన పీఎం.. అందులో ఏముందంటే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:12 PM
CM Revanth Met PM Modi : ఢిల్లీ పర్యటన ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ప్రధాని సీఎంకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. అందులో ఏముందంటే..

CM Revanth Met PM Modi : హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా.. చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహాయం, నిధులు త్వరితగతిన సాధించడమే లక్ష్యంగా ఇవాళ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన జరిగింది. ప్రధాని మోడీని కలిసిన రేవంత్ 5 కీలక ప్రాజెక్టులపై ప్రధానితో కూలంకషంగా చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సెమీ కండక్టర్ మిషన్‌పై ప్రధాని మోడీతో చర్చించారు. అయితే మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ బీజెపి నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ మాత్రం మోడీ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా ఉన్నారని, త్వరగా పూర్తిచేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారని సీఎం రేవంత్ చెప్పడం ఇప్పుడు తెలంగాణ బీజేపి నేతలని ఇరుకున పెట్టినట్లు అయింది.
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఐదు అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అండగా నిలవాలని ప్రధానిని సీఎం కోరారు. తెలంగాణకు చెందిన 5 కీలక అంశాలు, ప్రాజెక్టులపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ ల మధ్య ఈ చర్చ జరిగింది. అందులో ఒకటి తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రూ.24,000 కోట్ల వ్యయమయ్యే హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టు కాగా, రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సెమీ కండక్టర్ మిషన్‌లు చర్చలో ఇతర ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని, మూసి పునర్జీవ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, రీజినల్ రింగ్ రైల్, డ్రైపోర్టు మంజూరు చేయండని, సెమీ కండక్టర్ మిషన్ కు అనుమతించాలని కోరారు. ఈ అంశాలపై ప్రధానంగా ప్రధానితో చర్చించిన రేవంత్ రెడ్డి.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందని మోడీ అభిప్రాయపడినట్లు చెప్పారు. మోదీ ఈ ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా ఉన్నారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ తెలంగాణ నేతల్ని ఇరుకున పెట్టేస్తున్నాయి.
నిధులు సాధించాల్సిన బాధ్యత వారిదే.. సీఎం..
ఒకవైపు బీఆర్ఎస్ నేతలు పూర్తిగా మూసి ప్రాజెక్టుని వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు తెలంగాణ బీజేపి కీలక నేతలు సైతం బీఆర్ఎస్ తో గొంతు కలిపి మాట్లాడుతున్నారు. రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసి పునర్జీవ ప్రాజెక్టుకు విరుద్ధంగా.. మూసి పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు పెద్ద స్కాం అనేసారు. ఈ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ఏటీఎంగా మార్చుకుందని కూడా విమర్శించారు. తెలంగాణ బీజేపి నేతల స్టాండ్ ఇలా ఉంటే.. అందుకు విరుద్ధంగా ప్రధాని మోడీని తాను ఒప్పించినట్లుగా రేవంత్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారుతుంది. సాక్షాత్తు ప్రధాని మోడీనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కనుక.. ఇక విమర్శలు చేయడం మాని మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుతో సహా.. ఈ 5 కీలక ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు సాధించాల్సిన బాధ్యత.. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌దే అంటూ రేవంత్ సవాల్ విసిరారు.
మరో వైపు.. ప్రధాని మోడీని కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో చేసిన చిట్‌చాట్ సంచలనంగా మారుతుంది. ఈ చిట్ చాట్ లో కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. దుబాయ్‌లో మృతిచెందిన సినీ నిర్మాత కేదార్..కేటీఆర్‌కు సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై న్యాయస్థానంలో పోరాడుతున్న రామలింగమూర్తి, కాలేశ్వరం కేసు వాదించిన న్యాయవాది సంజీవరెడ్డి, ఇప్పుడు కేటీఆర్ బిజినెస్ పార్ట్‌నర్ కేదార్.. ఈ ముగ్గురివీ అనుమానాస్పద మరణాలే అన్నారు రేవంత్ రెడ్డి. కేదార్, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అత్యంత సన్నిహితులనీ, SLBC టన్నెల్ ఘటనకు బీఆర్‌ఎస్ వైఫల్యమే కారణమనీ ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కాళేశ్వరం వలె SLBCలో లక్షల కోట్లు రావని నిర్లక్ష్యం చేశారన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై అవినీతి ఆరోపణల కేసుల్లో ఈడీ దర్యాప్తు జరగాలనీ, కానీ ఈడీ ఎందుకు వెనకడుగు వేస్తోంది అని ప్రశ్నించారు.
Read Also : టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..
ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
తమిళనాడు సీఎంకు అమిత్ షా కౌంటర్.. 5 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడి