Summer: వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:59 AM
ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. ప్రతిఒక్కరూ ఏదోఒక పనిమీద, ఎప్పుడోకప్పుడు బయలకు రావాల్సిందే.. అయితే.. ఎండవేడిమి నుంచి ఆయా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

- పగటిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు
హైదరాబాద్: ఈ ఏడాది మార్చి మాసం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్, మే మాసాలలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. వడదెబ్బ గుర్తించకుంటే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వార్తను కూడా చదవండి: మాంసాహారులకో బ్యాడ్ న్యూస్.. ఎల్లుండి దుకాణాలు బంద్
ఏప్రిల్ మాసం మొదటివారంలోనే పగటిపూట ఎండలు తీవ్రమయ్యాయి. వృద్ధులు, చిన్నారులు, పగటిపూట ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. 35 డిగ్రీలు మొదలుకుని 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలోనే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులను పగటిపూట ఎండలో బయటకు రాకుండా చూసుకోవాలి. వృత్తిరీత్యా బయటకు వెళ్తున్న వారు తలకు ఎండవేడి తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎక్కువ పోషకాలు ఉన్న పండ్లు, నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
వడదెబ్బ జాగ్రత్తలు
ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందువల్ల వేసవి కాలంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఎండలో తిరగడంతో రక్తకణాలు కుంచించుకుపోతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఇంటినుంచి బయటకు వచ్చే సమయంలోనే గొడుగు తీసుకువెళ్లాలి.
- తలకు క్యాప్ ధరించాలి.
- రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తప్పక తీసుకోవాలి.
- సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి.
- ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలి.
- వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.
- పుచ్చకాయ, కొబ్బరిబోండాలు.. మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
- కళ్లకు వేడి తగలకుండా సన్‌గ్లా్‌సలు పెట్టుకోవాలి.
- ఉడికించిన పచ్చిమామిడికాయ రసంలో ఉప్పు జీలకర్ర కలిపి తాగితే వడదెబ్బ తగలదు.
వడదెబ్బ తగిలితే..
- నీరు ఉల్లిపాయరసం రెండు కణతలకు, ఛాతిమీదపూస్తే వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వడదెబ్బ తగిలిన వారి ముఖంమీద, ఒంటి మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. గ్లాసుడు నీటిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తాగిస్తూ ఉండాలి.
- శరీరం మీద ఉన్న దుస్తులను వదులు చేసి విశ్రాంతి తీసుకోవాలి.
- వేడి వేడి పలచటి గంజీలో ఉప్పు వేసి తాగించాలి.
చిన్నారుల పట్ల జాగ్రత్తలు అవసరం
ఎండ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలను బయటకి తీసుకువెళ్లినపుడు వారి రక్షణకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. ఉదయం 10గంటలలోపు, సాయత్రం 5గంటల తర్వాత సమయాల్లో మాత్రమే బయటకు తీసుకువెళ్లాలి. అత్యవసరమై వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేక మెత్తడి దుస్తులు కప్పితీసుకువెళ్లాలి. చిన్నారులకు వేడి ప్రభావం తగిలితే వడదెబ్బ సోకే అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగిలినవారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చి సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలి.
- డాక్టర్ మౌనిక, మూసాపేట పీహెచ్‌సీ వైద్యాధికారి
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News