Share News

Police Suicide: అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:45 AM

కొద్ది నెలలుగా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఎస్సైలు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Police Suicide: అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్‌ మృతి

పరిగి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కొద్ది నెలలుగా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఎస్సైలు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. శాఖలో వరుస సంఘటనలు సంచలనం సృష్టిస్తుండగా.. తాజాగా ఓ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం దొంగఎన్కెపల్లికి చెందిన భానుశంకర్‌ కులకచర్ల పీఎ్‌సలో పోస్టింగ్‌ ఉండగా, పరిగి పీఎ్‌సకు అటాచ్‌తో విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌ కొంతకాలం నుంచి అతిగా మద్యం సేవించడంతోపాటు భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడని సన్నిహితుల ద్వారా తెలిసింది.


ఈ క్రమంలో ఆదివారం భానుశంకర్‌ హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో గల తన నివాసంలో మృతి చెందాడు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఫిట్స్‌ వచ్చి మృతి చెందాడా? లేదా కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో అంబర్‌పేట్‌ పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 03:45 AM