D Sridhar Babu: ఆయన ఎలాంటి వారో దగ్గర నుంచి చూశా.. సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 28 , 2025 | 08:58 PM
D Sridhar Babu: ఆయన ఎలాంటి వారో దగ్గర నుంచి చూశా.. సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి డీ.శ్రీధర్ బాబు విలేకర్లతో ఇష్టా గోష్టిగా మాట్లాడుతూ.. దావోస్‌లో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడిది బ్రాడ్ మెంటాలిటీ అని అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కేపబులిటి ఉందని పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడానని పేర్కొన్నారు. ఆయన చాలా బ్రాడ్ థింకింగ్‌తో ఉన్నారని చెప్పారు. అంతేకాదు.. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపార వనరులు ఉన్నాయని.. కోస్టల్ ఏరియా సైతం ఉందని తెలిపారు. ఆ ఏరియాలో మంచి పరిశ్రమలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలు పరిశ్రమలతో వారు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు చేసుకున్నారని వివరించారు. అయితే ఏపీ ప్రభుత్వంతో చేసుకొన్న అవగాహన ఒప్పందాలు దావోస్‌లో ఎందుకు ప్రకటించలేదని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను తాను ప్రశ్నించానని ఈ సందర్బంగా మంత్రి డీ.శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు. తాము ఆంధ్రప్రదేశ్‌లోనే చెబుతామని నారా లోకేష్ నుంచి సమాధానం వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో వారు పెట్టుబడుల వ్యవహారంలో కచ్చితమైన వ్యూహాంతో వారు ఉన్నారనే విషయం తనకు పూర్తిగా అర్థమైందని చెప్పారు. అదీకాక.. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుకూలతలు..పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు.. అల్టిమేట్ అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలన్నీ సఫలం అయితే.. భవిష్యత్తులో తమని కంపేర్ చేసేటప్పుడు తక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
హైదరాబాద్‌ను డిస్టర్బ్ చేసే మూడ్‌లో సీఎం చంద్రబాబు లేరని ఈ సందర్భంగా మంత్రి డీ శ్రీధర్ బాబు కుండ బద్దలు కొట్టారు. అదీకాక ఆయన మాటలు చాలా పెద్దరికంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ కంపెనీలు ఏపికి రావాలి.. ఇక్కడ డిస్టర్బ్ చేయాలనే ఆలోచన ఆయనకు అస్సలు లేదు...హైదరబాద్ ఇంకా అభివృద్ది కావాలని ఆయన కోరుకుంటున్నారన్నారు.
Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం
ఇక దావోస్‌లో మైనస్ 8 నుంచి11 వరకు ఉష్ణోగ్రత ఉంది. తామంతా స్వెటర్స్ వేసుకున్నాం.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రెగ్యులర్ డ్రెస్‌లో ఉన్నారన్నారు. చంద్రబాబు చాలా ఫిట్‌గా ఉన్నారని.. ఆయన ఆ ఏజ్‌లో సైతం చాలా యాక్టీవ్‌గా ఉండడం..గ్రేట్ అని అభివర్ణించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు
For Telangana News And Telugu News