Share News

Bhatti Vikramarka: రైతు భరోసాకు రూ.8,400 కోట్లు

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:06 AM

గణతంత్ర దినోత్సవం రోజు, జనవరి 26 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న రైతు భరోసా పథకం కోసం రూ.8,400 కోట్లు సిద్ధం చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Bhatti Vikramarka: రైతు భరోసాకు రూ.8,400 కోట్లు

  • 26 నుంచి పంపిణీ, అదే రోజుఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా: భట్టి

మహబూబ్‌నగర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గణతంత్ర దినోత్సవం రోజు, జనవరి 26 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న రైతు భరోసా పథకం కోసం రూ.8,400 కోట్లు సిద్ధం చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పన అందజేసే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా జనవరి 26 నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని అన్నారు.


వనపర్తి జిల్లాలో గురువారం రెండు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను ప్రారంభించి మరో ఏడింటికి శంకుస్థాపన చేసిన భట్టి.. ఆ తర్వాత ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం రోజూ 18 గంటలపాటు పనిచేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిన మోపిందని దుయ్యబట్టారు. ఇబ్బందులున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లోనే రూ. 22 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 04:06 AM