ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:37 PM
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి నిరవధిక పోరాటాలు చేస్తామని ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి కలిసి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌బక్కి వెంకటయ్య
కలెక్టరేట్, మార్చి28(ఆంరఽధజ్యోతి): జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి నిరవధిక పోరాటాలు చేస్తామని ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి
కలిసి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖ పరిధిలోని అట్రాసిటీ కేసులు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదోవ పట్టకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులు బాధితులకు జరగాల్సిన న్యాయం అందిన పరిహారం ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన భూ పంపిణీ, భూ వివాదాలు, పోడు భూముల పరిష్కారం, విద్యార్థులకు ప్రత్యేక వసతులపై సమీక్షించారు. పోలీసు స్టేషన్‌లో నమోదైన అయిన కేసులపై ప్రభుత్వం సత్వరమే పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కమిషన్ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులను సమన్వయం పరుస్తున్నామన్నారు. భూ సంబంధిత ధరఖాస్తులు కనీసం 15రోజుల్లో పరిష్కరించే విధంగాచర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, కొమురం నీలాదేవి, రేణికుంట్ల ప్రవీణ్, శంకర్, డీసీపీ భాస్కర్, జిల్లా అటవీఅధికారి శివాజీ సింగ్ పాల్గొన్నారు.