ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Office: భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:55 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

  • ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన కార్యకర్తలు

  • పోలీసులకు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. రోడ్డెక్కి ఆందోళన

  • ఇందిరమ్మ రాజ్యంలో గూండాయిజమా?: కేటీఆర్‌

  • ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. దాడులా: హరీశ్‌రావు

  • కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ద్వేషం, హింస: కవిత

భువనగిరి టౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి రామకృష్ణారెడ్డి శనివారం బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎంను దూషిస్తూ ‘రండ.. రండ’ అంటూ పలుమార్లు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇవి తీవ్ర దుమారాన్ని లేపాయి.


దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్‌ శ్రేణులు ఈ దాడులకు దిగాయి. బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడి చేసిన యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగ ప్రవీణ్‌, వస్తువుల సాయి, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు మద్దం వాసుదేవరెడ్డి, ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుర్పంగ చందు తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ పైళ్ల శేఖర్‌రెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ కె సురే్‌షకుమార్‌ తెలిపారు. కాగా, దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. నిరసన ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించి, నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


ఇందిరమ్మ రాజ్యమంటూ గుండాయిజమా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్ర జ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్‌ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.


ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. దాడులా: హరీశ్‌ రావు

తమ పార్టీ నాయకులు వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని కాంగ్రెస్‌ నాయకత్వం దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌ మాటలతో దాడులు చేస్తుంటే.. ఆ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని ట్విటర్‌లో ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 05:55 AM