దేశంపై ఉగ్రవాదుల ముప్పు.. ఏ క్షణమైనా దాడులు

ABN, Publish Date - Apr 13 , 2025 | 01:29 PM

దేశంపై ఉగ్రదాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందా. ఏక్షణమైనా దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చా. నిఘా సంస్థల హెచ్చరికలు ఏం చెబుతున్నాయి. ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది.

దేశంపై ఉగ్రదాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందా. ఏక్షణమైనా దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చా. నిఘా సంస్థల హెచ్చరికలు ఏం చెబుతున్నాయి. ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ముంబై ఉగ్రదాడుల కీలక కుట్రదారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారతదేశానికి తీసుకువచ్చి విచారిస్తున్న సమయంలో నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాల అధికారులు చెప్పారు. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని నిఘా వర్గాల అధికారులు వెల్లడించారు. నదీ మార్గాల ద్వారా తీవ్రవాదులు దేశంలో జోరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి.


2008 నవంబర్ 26వ తేదీన 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గాన ముంబైకు చేరుకుని సీఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైండెట్, తాజ్ హోటల్‌ తదితర ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. నవంబర్ 29వ తేదీ వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌కు చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలక పాత్రధారి. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు దాగి ఉన్నారనే అనమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్ వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎదురు కాల్పుల్లో జమ్మూ కశ్మీర్‌కు చెందిన జూనియర్ కమిషనెంట్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఆర్మీ ఆఫీసర్ కుల్దీప్ చంద్ ఇవాళ చనిపోయారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు.


మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

Minister Nara Lokesh: సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం

AP NEWS: తిరుమలకు అన్నలెజినోవా.. అసలు కారణమిదే..

Birthday Celebrations: 20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు

Read Latest AP News And Telugu News

Updated at - Apr 13 , 2025 | 01:30 PM