టీటీడీకి విరాళాల వెల్లువ..పది రోజులలో ఎంతంటే..

ABN, Publish Date - Apr 03 , 2025 | 12:38 PM

టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాల ప్రవాహం భారీగా కొనసాగుతోంది. గడిచిన 10 రోజుల్లో పలువురు భక్తులు కోటి రూపాయాలకుపైగా ఇవ్వడంతో రూ. 32 కోట్లకుపైగా విరాళాలు అందాయి. భక్తుల విశ్వాసానికి ఆధ్యాత్మికతకు నిదర్శనంగా ఈ విరాళాలు భారీగా పెరుగుతున్నాయి.

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) విరాళాల పరంపర కొనసాగుతోంది. టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు (Trusts) గత పది రోజుల వ్యవధిలో రూ. 32 కోట్ల (Rs 32 Crores) విరాళాలు అందాయి.ఇందులో అత్యధికంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా అందగా.. అన్న ప్రసాదం ట్రస్టుకు అదే తరహాలో విరాళాలు అందాయి. అలాగే బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఎక్కువగా విరాళాలు అందాయి. అందులో కోటి రూపాయలకుపైగా విరాళాలు అందించిన భక్తులు ఎక్కువగా ఉండడం విశేషం. భక్తుల విశ్వాసానికి ఆధ్యాత్మికతకు నిదర్శనంగా ఈ విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో శ్రీవాణి ట్రస్టుకు రూ. 17 కోట్లు, అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 9 కోట్లు. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ. 8 కోట్లు వచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ


ఈ వార్తలు కూడా చదవండి..

ఎండాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం సురక్షితమేనా..

పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చే టిప్స్..

కూల్ వాటర్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..

For More AP News and Telugu News

Updated at - Apr 03 , 2025 | 12:38 PM