Home » LATEST NEWS
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీ ఐటీ రంగంలో వినూత్నమైన మార్పులకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఏజెన్సీలో గిరిజన రైతులు పండించే మన్యం కాఫీకిఇ ‘అరకు కాఫీ’ పేరిట బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. ఇప్పటికే శాసనసభ, పార్లమెంటు ఆవరణల్లో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయగా, తాజాగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ డివిజన్ కార్యాలయ నిర్మాణంలో భాగంగా చేపడుతున్న పనులను స్థానిక గిరిజనులు మంగళవారం అడ్డుకున్నారు.
గ్రామీణ పేదలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు ఇంకా అందడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 ఉప కేంద్రాలు, రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది.
కేజీహెచ్‌లో కొందరు వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడు తున్నారు.
జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యేటా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండడం, ఆశించినస్థాయిలో సాగునీరు అందడంతో వరి సాగు చేస్తున్న రైతుల సంఖ్య యేటా పెరుగుతోంది.
శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.
జిల్లా లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూ లీలకు వేతనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు నెలలకు పైగా వారికి కూలీ అందడం లేదు.
సంక్షేమ పథకాలన్నీంటికి ప్రభుత్వం రేషన్‌కార్డును తప్పనిసరి చేసింది. నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డును లింక్ చేసింది. రేషన్‌కార్డు లేని నిరుద్యోగులు పథకానికి దూరమవుతున్నారు. దాదాపు ఐదేళ్ళ క్రితం కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా అప్పటి నుంచి రేషన్ కార్డు కోసం అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నార.
విశాఖ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం వేయి ఎకరాలను గుర్తిస్తున్నామని, నగరానికి దగ్గరగా, రహదారి సౌకర్యం ఉన్న భూములనే ఎంపిక చేస్తామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
తిరుపతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాత్రూంలో కాలిజారిపడి తీవ్రగాయాలయ్యాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయన బంధువులు, కుటుంబసభ్యులకు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, వ్యాపారాలు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సొంతపార్టీ (వైసీపీ)నేతను ఆ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారు. అలాగే ఎంపీటీసీలు కూడా కనిపించకపోవడంపై వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Gurus Curse: గురువు మహిమ చాలా గొప్పది. గురు సంకల్పాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు. గురువు మాటను ధిక్కరించవద్దు. గురువు శాపంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వీడియోలో చూద్దాం.
మైనార్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ.. వారిని ఆకట్టుకోవడం కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. పండుగ సందర్భంగా మైనార్టీలకు కానుక ఇచ్చేందుకుగాను సౌగత్ ఎ మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. మరికొన్ని బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగుతోంది. కాగా ఈరోజు సభను సాయంత్రం 5 గంటలకే వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.
హైదరాబాద్‌కు చెందిన ఎన్.సునీల్‌రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్‌కి తరలించిన కీలకపత్రాలను లావు శ్రీకృష్ణదేవరాయలు, అమిత్ షాకు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఒకప్పుడు అవకాశాల స్వర్గం. సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు పరిస్థితి మారిందా. అమెరికా వెళ్లాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారా. డోనాల్డ్ ట్రంప్ వల్ల పర్యాటక రంగానికి 65 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ నష్టం జరుగనుందా. అసలు అమెరికాకు ఏమైంది. ఒకప్పుడు తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే దేశాల జాబితాలో తొలి స్థానంలో అమెరికా ఉండేది.
హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాకలో దోమల బెడదను నివారించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దోమల బెడదతో కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతుండగా.. మరికొందరు సాయంత్రం అయితే చాలు.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని బల్దియా అధికారులపై మండిపడుతున్నారు. నగర వాసులను ఈ దోమలు బెంబేలెతిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. అందులోభాగంగా జస్టిస్ వర్మ నివాసాన్ని త్రి సభ్య కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని సదరు కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ యూనిట్ కార్యాలయంలో మంగళవారం నాడు కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ రామోజీరావు, డిచ్పల్లి ఎస్ఐ రఫీ పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానందా హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి పత్రిక పాఠకుల కోసం కార్ అండ్ బైక్ రేస్‌ను సంస్థ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు లక్కీ కూపన్ల డ్రా నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి,మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే హాజరయ్యారు.
Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.
జగన్మోహన్ రెడ్డి భారీ లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్థదేవరాయలు అన్నారు. రూ. 18వేల 5 వందల కోట్లపైచిలుకు అవినీతి జరిగిందంటూ ఆయన పార్లమెంట్లో చెప్పారు. రూ. 4 వేల కోట్లు బినామీల పేరుతో విదేశాలకు తరలించారని అన్నారు.