Home » 2024 Lok Sabha Elections
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం ఒకేసారి రెండు భారీ రికార్డులను సృష్టించింది. ఇక్కడి విజేతకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.75 లక్షల ఆధిక్యం వచ్చింది. పోలైన ఓట్లలో ‘నోటా’ రెండో స్థానం పొందడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ లాల్వానీకి సమీప ప్రత్యర్థికన్నా 11,75,092 ఓట్ల మెజార్టీ లభించింది.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమత డిమాండు చేశారు. అ
అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్న దాంతో సంబంధం లేకుండా.. దేశాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. తమ మూడో దఫా పాలనలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించటంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించి అన్నింటా గెలిచింది. అసోంలో 14 సీట్లకు గాను 2019లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది.
రాజ్యాంగంపై మోదీ, అమిత్ షా దాడిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ, అమిత్ షాను వద్దని దేశం స్పష్టం చేసిందని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతల తీరుపై సంతృప్తిగా లేమని ప్రజలు తెల్చేశారని పేర్కొన్నారు. అలాగే, మోదీ, అదానీ ఒకటే అని ప్రజలకు అర్థమైపోయిందని..
సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడింది! పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓటర్లు ఎన్డీయేకు పట్టం కట్టారు! ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని పదే పదే హామీ ఇచ్చినా.. బీజేపీని మాత్రం మేజిక్ మార్కును దాటనివ్వలేదు! ఫలితంగా.. ఈసారి కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకానుంది! సంపూర్ణ ఆధిపత్యం పోయి..
ఒడిసా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్ పట్నాయక్‌కు ప్రజలు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌పై ఫైనల్‌గా ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లకు...
కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. అదొక చచ్చిన పాములాంటిదని హేళన చేశారు. ఆ పార్టీ ఇంకెప్పుడూ కేంద్రంలో అధికారంలోకి రాదని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యంగ్యాస్త్రాలు...
కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షంగా కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.