Home » Aadhaar Card
పోలింగ్ బూత్ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్‌హాట్ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్ హోలీమదర్స్ గ్రామర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్(నంబర్ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు.
ఆధార్ కార్డు పోతే తిరిగి పొందడానికి నెట్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటారు. ఫోన్లోనే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. ఫోన్లో ఈ ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
ఎలాగైతే మనకు ‘ఆధార్’ అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్‌లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు?
పాన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. యూజర్లు నిర్ణీత సమయంలోపు తన పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే.. చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు మే 31వ తేదీ లోగా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానిస్తే..
ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డ్(Aadhaar card) అత్యంత కీలక కార్డుగా మారిపోయింది. ఆధార్ కార్డ్ లేకుండా పలు రకాల స్కీమ్స్ సహా అనేక పనులు కూడా నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును తప్పులు లేకుండా మార్చుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని చెప్పవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే మీరు ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే వెంటనే ఉపయోగించుకోండి. అది ఎలాగే ఇప్పుడు చుద్దాం.
మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేసుకోవాలంటే మాత్రం మీరు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఆధార్ కార్డ్‌ను ఇంకా అప్డేట్ చేసుకోలేదా. అయితే మీకో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే చివరి తేదీని మళ్లీ పొడిగించింది.
వంద రోజుల ఉపాధి హామీ పథకం కూలీలకు ఆధార్ కార్డు(Aadhaar card) ద్వారా కూలి బట్వాడా చేసే ప్రక్రియ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులున్నారు.
ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్డేట్(Aadhaar Updation) చేయడానికి ఇప్పుడు 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. రకరకాల మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి ఆధార్ బయోమెట్రిక్ డేటాను సైతం విడిచిపెట్టడం లేదు.