Home » ABN
సోషల్ మీడియాలో తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్వెల వాణి.. టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. ఆ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు ఫిర్యాదు చేసేందుకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం దివ్వెల వాణితో కలిసి పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు అధికార పార్టీల నుంచి హాని ఉందని ఈ సందర్బంగా దివ్వెల వాణి ఆందోళన వ్యక్తం చేశారు.
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...
రోత పత్రిక సాక్షి చేసిన తప్పులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టింది. తొలుత ట్యాగ్‌ను గుర్తించి ప్రజల ముందు ఎండగట్టింది. తర్వాత డీఎస్ఎన్జీ ఫ్రీక్వెన్సీ ఇష్యూ.. ఆ తర్వాత యాప్‌ను కూడా వదల్లేదు. ఒక్కో తప్పును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెగ.. రోత పత్రిక తోక ముడిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో.. పట్టపగలు ఓ వ్యక్తి పోలీసులు, ఫైర్ సిబ్బందిని పరుగులు పెట్టించాడు. హైటెన్షన్ పోల్ ఎక్కి సీజే, ముఖ్యమంత్రి లేదంటే ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుంది.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సజ్జల విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది. కట్లకుంట గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆగంతకులు వాల్ పోస్టర్లు అంటించారు. గ్రామంలో ఉన్న మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మంత్రగాళ్లను ఒక్కొక్కరిగా హత్య చేయబోతున్నామంటూ ఆ వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!
ABN Andhrajyothy: సాక్షి మరోసారి అడ్డంగా దొరికేసింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తప్పుల మీద.. తప్పులు చేస్తూ పోతుంది. టెక్నాలజీలో తాము గూగుల్‌ను మించిపోయామనే కవరింగ్ ఇస్తూ..