Home » Agriculture
తమ ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలే జీవోలుగా వెలువడుతాయని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రజల అభిప్రాయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
పంటల సాగు కోసం చేసిన అప్పులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రెండేళ్ల క్రితం తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు అదే సమస్యతో ఆయువు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది.
ఈనెల 23నుంచి "పోలం పిలుస్తోంది"(Polam Pilustondi) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువుల వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు.
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తామని అన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మరిన్ని ఎకరాల భూమికి సాగునీరందించే దిశగా రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
రంగపూర్ చీనీ అంట్లు వాడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పలు రాష్ర్టాలకు చెందిన శాస్త్ర వేత్తల బృందం సూచించింది. స్థానిక డ్వామా సమావేశపు హాల్లో శని వారం ఉద్యాన పరిశోధన స్థానం రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్త సుబ్ర హ్మణ్యంతో కలిసి పలు రాష్ర్టాల శాస్త్రవేత్తలు చీనీ పంట సాగు, సోకుతు న్న తెగుళ్లు, నివారణ చర్యలు తదితర అంశాలపై ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులతో ఆరా తీశారు. జిల్లాలో సాగు చేస్తున్న చీనీ తోటలకు ఎండుకొమ్మ తెగులు, వేరు కుళ్లు...
ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుష్తోమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.