Share News

Congress: కాంగ్రెస్ చీఫ్ సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో బీజేపీ కాలుకూడా పెట్టలేదు

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:51 AM

కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడుగుకూడా పెట్టలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై అన్నారు. ఈ వ్యా్ఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. ఓపక్క గత రెండు రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, మరోవైపు అధికార డీఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేస్తుండడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

Congress: కాంగ్రెస్ చీఫ్ సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో బీజేపీ కాలుకూడా పెట్టలేదు

- సెల్వపెరుందగై

చెన్నై: ఎంతటి బలమైన కూటమితో ఎన్నికల్లో పోటీ చేసినా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అడుగు పెట్టలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై(TNCC President Selvaperunthagai ) అన్నారు. రాయపేటలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజల కోసం అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగానికి కేంద్రంలోని బీజేపీ(BJP) పాలకులతో ప్రమాదం పొంచి ఉందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం


nani2.2.jpg

రాజ్యాంగాన్ని, చట్టాలను పరిరక్షించేందుకు కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉత్పన్నమైందన్నారు. భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేసి ఆర్‌ఎ్‌సఎస్‌ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రణాళిక రచించారని దీన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. అలాగే, బీజేపీ ఉండే కూటమికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

నీవు లేక నేనుండలేను..

ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

అందువల్లే అంత ఆసక్తి !

Updated Date - Apr 15 , 2025 | 11:51 AM