Share News

Jayakumar: నేను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదు..

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:09 PM

మాజీ మంత్రి డి.జయకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదంటూ ఆయన అన్నారు. అంతేగాక తాను పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో పనిగట్టుకుని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Jayakumar: నేను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదు..

- నాపై దుష్ప్రచారం

- మాజీ మంత్రి డి.జయకుమార్‌

చెన్నై: గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవటానికి బీజేపీ(BJP) కారణమని పదేపదే ఆరోపణలు చేస్తూ వచ్చిన అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌(D. Jayakumar) తాను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీతో తమ పార్టీ పొత్తు కుదుర్చుకోవడంతో తాను పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో పనిగట్టుకుని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: Summer: ఇక.. మరింత పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు


డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌ కూడా బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకుంటే రాజీనామా చేస్తానంటూ ఆయన వద్ద తెలిపినట్లు దురుద్దేశంతో వదంతులు పుట్టిస్తుండటం గర్హనీయమని పేర్కొన్నారు. తిరుమావళవన్‌తో తాను ఎప్పుడూ అలా చెప్పలేదని జయకుమార్‌ అన్నారు.


nani4.2.jpg

తమ కుటుంబం 75 యేళ్లుగా ద్రావిడ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటోందని పదవి కోసం ఎవరి కాళ్ళపైనా పడే మనస్తత్వం తనది కాదని చెప్పారు. పార్టీలో తనకు గుర్తింపు రావడానికి ఎంజీఆర్‌, జయలలిత తనపై చూపిన ఆదరాభిమానాలే ప్రధాన కారణమని చెప్పారు. పెరియార్‌, అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత మార్గంలోనే తన జీవన ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

నీవు లేక నేనుండలేను..

ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

అందువల్లే అంత ఆసక్తి !

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2025 | 01:09 PM