Home » Ajmera Rekha
బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందిన జాన్సన్ నాయక్‌పై దుమారం మొదలైంది. జాన్సన్ నాయక్ లంబాడా తెగకు చెందిన వాడు కాదని ఆయన తాత, ముత్తాతలు, తల్లిదండ్రులు క్రైస్తవ మతంలో కొనసాగుతున్నారంటూ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను చేసింది ఎవరో కాదు స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో చిత్రవిచిత్రాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను (115 BRS Candidates) ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూసిన సంగతి తెలిసిందే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్.. మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అభ్యర్థుల తొలి జాబితాను (BRS First List) రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైంది. తమకు ఈసారైనా టికెట్ దక్కకపోతుందా..? అని ఆశావహులు, పక్కాగా టికెట్ మనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. జాబితాలో తప్పుకుండా పేరుంటుందని మరికొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో..
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు (Kadem Project) డేంజర్ జోన్లో ఉంది. కెపాసిటికి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.5లక్షల క్యూసెక్కులు కాగా.. అంతకుమించి వస్తున్న వరద వచ్చి చేరింది...