Share News

Georgia National University: ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:59 AM

ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపనకు జార్జియా నేషనల్‌ యూనివర్సిటీ(జీఎన్‌యు) ఒప్పందం చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.1300 కోట్ల పెట్టుబడులు పెట్టి, 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు

Georgia National University: ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం

  • లోకేశ్‌ సమక్షంలో జార్జియా నేషనల్‌ వర్సిటీతో ఒప్పందం

  • ఏర్పాటుకు ముందుకొచ్చిన

  • జార్జియా నేషనల్‌ యూనివర్సిటీ

  • లోకేశ్‌ సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జార్జియా నేషనల్‌ యూనివర్సిటీ(జీఎన్‌యు) ముందుకొచ్చింది. ఈమేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖతో సోమవారం జీఎన్‌యూ ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపనకు జీఎన్‌యు రూ.1300 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర విద్యార్థులను గ్లోబల్‌ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఒప్పందం ఒక నిదర్శనమన్నారు. కాగా, రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం.


జార్జియా యూనివర్సిటీ టెక్నాలజీ, బిజినెస్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తుంది. ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. 2002లో స్థాపించిన జార్జియా యూనివర్సిటీ ఆ దేశంలో అతిపెద్ద వర్సిటీగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు ఇంటర్నేషనల్‌ అక్రెడిడేటెడ్‌ ఫ్యాకల్టీ ప్రోగ్సామ్స్‌లో గ్లోబల్‌ కంపెనీలతో కొలాబ్రేషన్‌లో ఉంది. కార్యక్రమంలో జీఎన్‌యు వ్యవస్థాపకుడు గియా కావ్టెలిష్విలి, వైస్‌ రెక్టార్‌ జార్జ్‌ గవ్తాడ్జే, రాష్ట్ర అధికారులు కోన శశిధర్‌, భరత్‌గుప్తా పాల్గొన్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:02 AM