Share News

తమీమ్‌కు గుండెపోటు

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:01 AM

బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (36) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్‌ డివిజన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడుతుండగా అతడికి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు...

తమీమ్‌కు గుండెపోటు

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (36) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్‌ డివిజన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడుతుండగా అతడికి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమీమ్‌కు స్టెంట్‌ వేసి రక్తనాళాల్లో ఉన్న అడ్డంకిని తొలగించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. షైన్‌పుకార్‌ క్రికెట్‌ క్లబ్‌తో మ్యాచ్‌లో మహ్మడెన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న తమీమ్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో మ్యాచ్‌ మధ్యలోనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఎయిర్‌ అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించాలనుకొనేలోపు మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో విపత్కర పరిస్థితుల్లో అక్కడే ఉంచి సర్జరీ చేయించారు. తమీమ్‌ స్పృహలోకి వచ్చాడని బీసీబీ చీఫ్‌ ఫిజీషియన్‌ దేబాశిష్‌ చౌధరి తెలిపాడు. బంగ్లా తరఫున తమీమ్‌ 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన

Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 03:01 AM