Share News

Parking Fee Regulations: బిల్లు, సినిమా టికెట్‌ ఉంటే పార్కింగ్‌ ఫీజు లేదు

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:53 AM

వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్‌ ఫీజు వసూలు నియమాలను మున్సిపల్‌ మరియు పట్టణాభివృద్ధి శాఖ క్రమబద్ధీకరించింది. 30 నిమిషాలు నుంచి 1 గంట వరకు కొనుగోలు బిల్లులతో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయకూడదని నిర్ణయించారు.

Parking Fee Regulations:  బిల్లు, సినిమా టికెట్‌ ఉంటే పార్కింగ్‌ ఫీజు లేదు

  • అర్ధగంటలోపైతే ఎవరికైనా ఉచితమే

  • షాపింగ్‌ మాల్స్‌,మల్టీప్లెక్స్‌లపై మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు

  • మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద వసూళ్లపై క్రమబద్ధీకరణ: మున్సిపల్‌ శాఖ

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడాన్ని క్రమబద్ధీకరిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పార్కింగ్‌ స్థలాలను ఇతరులు దుర్వినియోగం చేయకుండా చర్యలు చేపట్టింది. వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు పార్కింగ్‌ స్థలాల్లో అర్ధగంట వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని సోమవారం స్పష్టం చేసింది. అలాగే, ఆయా వాణిజ్య సముదాయాల్లో ఏవైనా వస్తువులు కొన్నట్టు బిల్లులు చూపిస్తే 30 నిమిషాల నుంచి గంట లోపు వరకు పార్కింగ్‌ ఫీజు వసూలు చేయకూడదని పేర్కొంది.


సినిమా టికెట్‌ లేదా ఆ సముదాయంలో పార్కింగ్‌ ఫీజు కంటే ఎక్కువ విలువైన వస్తువులు కొన్నట్టు బిల్లులు చూపిస్తే గంట కంటే ఎక్కువ సమయం వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచినా పార్కింగ్‌ ఫీజు మినహాయిస్తారు. ఈ ఆదేశాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:53 AM