Home » Akhilesh Yadav
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీచేసే నియోజకవర్గం ఖరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 150 సీట్లకు మించి రావని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. తొలి విడత పోలింగ్ ప్రచారానికి బుధవారంనాడు తెరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఇద్దరు నేతలు మీడియా సంయుక్త సమావేశంలో పాల్గొ్న్నారు.
గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయనేతగా మారి ఇటీవలే జైలులో గుండెపోటుతో మరణించిన ముఖ్తార్ అన్సారీని గత ఫిబ్రవరి 16న జైలులోనే మరణించిన రష్యా విపక్ష నేత అలెగ్జీ నవాల్నీతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోల్చారు. ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు పంపింది. 160 సీఆర్పీసీ కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు పంపింది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 2012-2016 మధ్య ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.