Home » Amaravati farmers
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తైనా.. ఇప్పటివరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. 2015 అక్టోబర్లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది.
రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఈరోజు అమరావతిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని మొదటి దశ పనులను గతంలో టీడీపీ హయాంలోనే తుదిదశకు చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో ఎన్డీయే ప్రభుత్వం(NDA Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి(Capital Amaravati) అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో జంగిల్, బుష్ క్లియరెన్స్ చేయాలంటూ సీఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి ధ్వంస రచన కోసం.. జగన్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్ ప్లాన్ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
అమరావతి: రాజధాని రైతులు ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం(NDA government) అధికారంలోకి రావడంతో విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు అమరావతి రైతులు(Amaravati Farmers) ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కాలినడకన బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో 29గ్రామాల రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు.