Home » Amaravati farmers
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాజధాని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని కోసం భూమిచ్చిన రైతులు దాదాపు ఐదేళ్ల పాటు తమ పోరాటాన్ని కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో రాజధాని గ్రామాల్లోని రైతులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో రైతులు మళ్లీ అమరావతిని రాజధానిగా చేస్తారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా అమరావతిలోనే చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాపాలు ఈ నెల 4వ తేదీతో పండనుందని అమరావతి రైతు ఆలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంతటితో ఆయన పరిపాలన అంతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రిని తాము ఎన్నడూ చూడలేదన్నారు.
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
సాధారణంగా పరిశ్రమల స్థాపన కోసమో, ఇతర అవసరాల కోసమో ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త విషయం ఏంటంటే.. ఓ ప్రైవేటు వ్యక్తి గ్రామాలకు గ్రామాలనే తన వశం చేసుకుంటున్నాడు.
రాష్ట్ర రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తలసరి రుణ భారంలో రాష్ట్ర రైతులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు పేరుకుంది.
ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇస్తూ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి పేర్కొంటూ.. పెన్షన్‌ను 2028లో రూ.250, 2029లో మరో రూ.250 చొప్పున ఐదో ఏడాదికి రూ.3,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. పాత హామీలకే రంగులద్ది కొత్త మేనిఫెస్టోలో చేర్చారు.
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి ఉద్యమానికి ఎన్నికల సంఘం ఆదేశాలు పోలీసుల సూచనమేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, దళిత, మైనారిటీ జేఏసీ సభ్యులకు, లీగల్ అండ్ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఈ మేరకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు అందాయి.
Andhrapradesh: రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజులు ముందు భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరుకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ రద్దుతో రాజధాని మాస్టర్ ప్లాన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 21 రెవెన్యూ గ్రామాల్లో 625 ఎకరాల సేకరణ పరిధి నుంచి మినహాయింపు రానుంది.