Home » Andhra Pradesh Politics
‘ఆయన విలువలున్న వ్యక్తి. ఈయన మనసేమో వెన్న, ఇంకొకాయన లోకల్ హీరో’ అంటూ తమ పార్టీ అభ్యర్థులను జగన్ (YS Jagan) పరిచయం చేస్తుంటే వారి చరిత్ర తెలిసిన జనం విస్తుబోయారు. భీమవరం(Bhimavaram) సభలో తన ప్రసంగం పూర్తయ్యాక నరసాపురం(Narasapuram) ఎంపీ అభ్యర్థిని, ఏడు అసెంబ్లీ అభ్యర్థులను సీఎం పరిచయం చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు.
‘వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నవ్యాంధ్ర ప్రపంచపటంలోకి ఎక్కితే.. నేడు ఆ పేరు లేకుండా పోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్.. ఇక నీ ఆటలు సాగవు’’ అని సినీ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి
‘‘మీ ఫోన్ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు. మీ ఫోన్ ఇచ్చేదానికి ఏమైంది?’’ అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే... ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఈసీ ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరే వేరు! ఆయన ఇప్పటికీ జగన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. గీత దాటి మరీ జగన్
ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంతుకుడు రాయి విసరడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఎన్నికల వేళ ఈ ఘటన దురదృష్టకరమే. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటులేదు. కానీ ఇటీవల కాలంలో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తాము చేసిన పనులకంటే.. తాము నియమించుకున్న పోల్ స్ట్రాటజీ సంస్థలనే ఎక్కువుగా నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నేతల ఇసుక దాహం ఎప్పటికీ చల్లారేలా లేదు. ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఏఎస్ పేటలోని నక్కల వాగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది.
‘నిజం గెలవాలి’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 203 కుటుంబాలను పరామర్శించానని, మరో కార్యక్రమంతో మే 10 వరకు ప్రజల్లో ఉండాలని భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలోని ఐదుగురు ఉత్తరాంధ్రను ఊడ్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వనరులను దోచుకున్నారని దుయ్యబట్టారు. కొండలను సైతం అనకొండలా మింగేశారని, చివరకు రుషికొండను
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌పై(YS Jagan) రాయి దాడి ఘటన కలకలం రేపుతోంది. అయితే, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఈ దాడి జగనే చేయించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే కోడికత్తి దాడి జరగడం.. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే దాడి జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో వైసీపీ(YCP) డిఫెన్స్లో పడిపోయింది. ఏం చేయాలో పాలుపోక..
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ఈనెల 19న నామినేషన్(Election Nomination) దాఖలు చేయనున్నారు. పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు... ‘ఈనెల 18న భువనేశ్వరి కుప్పం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త చంద్రబాబు..