AP Elections: జగన్‌పై రాయి దాడి.. ప్రజల్లో ఎన్నో అనుమానాలు..?
ABN , Publish Date - Apr 16 , 2024 | 11:56 AM
ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంతుకుడు రాయి విసరడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఎన్నికల వేళ ఈ ఘటన దురదృష్టకరమే. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటులేదు. కానీ ఇటీవల కాలంలో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తాము చేసిన పనులకంటే.. తాము నియమించుకున్న పోల్ స్ట్రాటజీ సంస్థలనే ఎక్కువుగా నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంతుకుడు రాయి విసరడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఎన్నికల వేళ ఈ ఘటన దురదృష్టకరమే. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటులేదు. కానీ ఇటీవల కాలంలో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తాము చేసిన పనులకంటే.. తాము నియమించుకున్న పోల్ స్ట్రాటజీ సంస్థలనే ఎక్కువుగా నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టి.. తద్వరా సానుభూతి పొందడమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తొలుత ఇలాంటి నీచపు రాజకీయాన్ని ప్రజలు పసిగట్టలేకపోయారు. ఒక అబద్ధాన్ని నిజమని ఎక్కువ రోజులు నమ్మించలేం. అలాగే రానురాను ప్రజలు చైతన్య వంతులవ్వడంతో ఇలాంటి కుట్రలను పసిగట్టడం మొదలుపెట్టారు.
2019 ఎన్నికల ముందు కోడి కత్తితో జగన్‌పై దాడి జరిగినప్పుడు ప్రజల్లో కొంచెం సానుభూతి వచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత వివేక హత్య విషయంలోనూ జగన్‌పై మరికొంత సానుభూతి పెరిగింది. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొడితే.. సానుభూతి క్రియేట్ అయితే ఎలా ఉంటుందనడానికి ఆ ఎన్నికలే నిదర్శనంగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీ కాలుకు గాయమైందంటూ.. ఆమె వీల్ చైర్‌లోనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోపల ఎలా ఉన్నా.. బయట ప్రజల వద్దకు వచ్చేటప్పుడు మాత్రం వీల్‌చైర్‌లో దర్శనమిచ్చేవారు మమత బెనర్జీ.
ఆ ఎన్నికల్లోనూ ఆమె పార్టీకి సానుభూతి కలిసివచ్చింది. కాని ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం ఆమె వీల్‌చైర్‌లోంచి లేచి.. ఫుట్‌బాల్‌ను కాలితో తన్నారు.. దీంతో ఆ ఘటనపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. అప్పటినుంచి ప్రజలు కొంత అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో సానుభూతి కోసమే ఇలాంటి ఘటనలను పక్కా ప్లాన్‌తో చేయించుకుంటున్నారనే అనుమానాలు మొదలయ్యాయి.
YSRCP: సీఎం వైఎస్ జగన్‌తో నిందితుడు ఉన్నా సీబీఐ పట్టించుకోదేం..?
జగన్ ఘటనపై..
జగన్‌పై రాయి దాడి ఘటన తర్వాత వైసీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వాస్తవానికి దాడి తర్వాత నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయాలి. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి. అవ్వన్నీ ప్రభుత్వంలో ఉన్నవాళ్లే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఎన్నికల సంఘం కింద పని చేస్తున్నప్పటికి.. ఇలాంటి ఘటనల విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. పోలీసుల దర్యాప్తు పూర్వవ్వకుండానే.. అసలు ఘటనకు గల కారణాలు తెలియకుండానే.. తమ నాయకుడిపై దాడి జరిగిందంటూ ప్రజల దృష్టిని ఇటుగా మరల్చేందుకు వైసీపీ నాయకులు నిరసనలకు దిగారనే విమర్శలు వచ్చాయి. ఓ వైపు ప్రభుత్వంపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. అటు నుంచి దృష్టి మరల్చి సానుభూతి పొందేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ పల్లెల్లో ప్రజలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రజలు సానుభతి తెలపకపోగా.. ఇలాంటివి మేము నమ్మబోమంటూ ప్రజలు స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజల ఆలోచనా విధానం చూస్తుంటే సానుభూతితో ఓట్లు పొందే రోజులు పోయాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఎన్నో అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్న ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి రెడీగా లేమని తెగేసి చెబుతున్నారు.
దర్యాప్తులో పురోగతి
మరోవైపు జగన్‌పై రాయి దాడి ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనేది పూర్తి దర్యాప్తు తర్వాత తేలనుంది.
CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి