AP Politics: డిఫెన్స్‌లో వైసీపీ.. చంద్రబాబుపై దుష్ప్రచారం.. కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్..
ABN , Publish Date - Apr 14 , 2024 | 02:15 PM
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌పై(YS Jagan) రాయి దాడి ఘటన కలకలం రేపుతోంది. అయితే, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఈ దాడి జగనే చేయించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే కోడికత్తి దాడి జరగడం.. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే దాడి జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో వైసీపీ(YCP) డిఫెన్స్‌లో పడిపోయింది. ఏం చేయాలో పాలుపోక..
అమరావతి, ఏప్రిల్ 14: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌పై(YS Jagan) రాయి దాడి ఘటన కలకలం రేపుతోంది. అయితే, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఈ దాడి జగనే చేయించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే కోడికత్తి దాడి జరగడం.. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే దాడి జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో వైసీపీ(YCP) డిఫెన్స్‌లో పడిపోయింది. ఏం చేయాలో పాలుపోక.. సోషల్ మీడియాలో రివర్స్ అటాక్‌కు దిగింది. దాడి జరిగిన క్షణం నుంచే జగన్‌పై హత్యాయత్నం అంటూ చంద్రబాబును(Chandrababu) టార్గెట్ చేసుకుంది వైసీపీ. చంద్రబాబు కుట్ర అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తించేలా విమర్శలు చేస్తున్నారు.
అయితే, వైసీపీ ప్రచారానికి విరుద్ధంగా ప్రజలు, సోషల్ మీడియాలో ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఇదంతా వైసీపీ డ్రామా అంటూ పౌరులు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. కోడికత్తి డ్రామా 2, నాడు కోడికత్తి, నేడు రాయి నెత్తి అంటూ వేలాదిగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. నాడు మంత్రులుల చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాడు ప్రతిపక్ష నేత బస్సుపై రాళ్ల దాడి సమయంలో అదొక నాటకం అంటూ వైసీపీ ముఖ్య నేతల వ్యాఖ్యలు చేశారు. ప్రజా వ్యతిరేక ఉండడం వల్లనే ఇలాంటి రాళ్లు పడతాయని నాడు స్వయంగా మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో కౌంటర్స్ వేస్తున్నారు.
భద్రతా వైఫల్యంపై ప్రశ్నల వర్షం..
సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో భద్రతా వైఫల్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎం రోడ్ షో జరుగుతుంటే కరెంట్ ఎందుకు తీశారు? భద్రత చూడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి నేటి వరకు జగన్ ప్రతి ఎన్నికల ముందు ఒక డ్రామా అడుతుతున్నారని, దాన్ని ప్రతిపక్షంపై నెడతారంటూ సోషల్ మీడియాలో సీక్వెన్స్ పై పోస్టులు పెడుతున్నారు. జగన్‌పై దాడి నుంచి సానుభూతి పొందే క్రమంలో వైసీపీ కుట్రలను కడిగేస్తున్నారు నెటిజన్లు. ‘నీ ప్రభుత్వం, నీ పోలీసులు, నీ కార్యకర్తలు ఉంటే.. ప్రతిపక్షంపై ఆరోపణలా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్‌పై దాడి విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తటస్థులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దాడి జరిగినప్పటి నుంచి దీనిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం తెగ రెచ్చిపోతున్నారు. అయితే, వీరి ప్రచారాలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల వేళ జగన్ డ్రామాలు కొత్తేం కాదని రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు.