Home » Andhra Pradesh Politics
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజలు సర్వస్వం కొల్పోయారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు మిగిల్చిన భారీ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలన్నారు.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి భూముల దందాలకు బ్రేక్ వేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్. పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు కాజేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. తాము ఎలాంటి అక్రమాలు చేసినా.. అవి సక్రమాలే అవుతాయనే ఆలోచనతో..
గత ఐదేళ్ల కాలంలో జగన్‌తో అంటకాగి.. ఐఏఎస్ అధికారులమన్న మాటే మరచి.. ఫక్తు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించిన అధికారులపై వేటు మొదలైంది. జగన్ హయాంలో తానే సూపర్ సీఎం అన్నట్లుగా.. నియంతను తలపించేలా ప్రవర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ...
మెగా డీఎస్సీ, సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు.
CM Chandrababu Naidu Visit Amaravati Live Update: ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ముగిసింది. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ సీఎం పరిశీలించారు. మరికాసేపట్లో ప్రెస్మీట్లో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడమే కాదు.. పరిపాలన విభాగంలోనూ సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న జగన్ భజన బ్యాచ్.. బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ పాలనా సమయంలో అనేక శాఖల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఈ బ్యాచ్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని విషయాలను జగన్కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లపాటు పడావుపడిన అమరావతికి(Amaravati) మళ్లీ పునర్వైభవం రానుంది. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు.