Home » Annamayya District
పారి శుధ్య కార్మికుడు పోలీసులు, ప్రజలను రెండు గంటలపాటు హైరానా పట్టించాడు. స్థానిక ఎస్సీ కాలనీ వాసి కార్మికుడు కోగర శ్రీనివాసులు సాయంత్రం జ్యోతిసర్కిల్లో ఉన్న 60 అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంకు ను ఎక్కాడు. ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోతున్నానని పలువురికి ఫో న్ చేశాడు. విషయం తెలియడంతో శ్రీనివా సులు భార్య శిరీష, ముగ్గురు పిల్లలు, సీఐ రాజారెడ్డి, సిబ్బంది ట్యాంకు వద్దకు చేరుకు న్నారు.
చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి భూమిపూజ చేశారు
పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని పార్టీ అధిష్టానం అందించిన లక్ష్యానికి మించి చేయాలని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
మదనపల్లె డివిజనలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న తాత్కా లిక బాణసంచా దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సబ్కలెక్టర్ మేఘస్వరూప్ సూచించారు.
గుర్రంకొండలో గుప్త నిధుల ముఠా సభ్యులు పురాతన ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు.
మదనపల్లె పట్ట ణంతో పాటు, శివారులోని కుర వంక గ్రామ పంచాయతీలో ప్రవ హిస్తున్న కురవం క ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సీరియస్ అయ్యారు.
ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరాడు. 15 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తాను లాభాలు పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయ పాఠశాల ద్వారా మరింత మంది రైతులకు సలహాలు ఇస్తూ వారిని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తవలం పం చాయతీ చౌకిళ్లవారిపల్లె రైతు గుమ్మడి గంగులప్ప సామాన్య రైతు కటుంబీకుడు.
గిన్ని స్ బుక్లో పేరు సంపాదించాలన్న లక్ష్యంతో ఓ యువకుడు దేశ విదేశాలకు చెందిన అనేక నాణేలను సేకరిస్తున్నాడు. రైల్వేకోడూరు వాసి వసీమాఅస్లాం బీటెక్ చదివాడు. తండ్రి నడుపుతున్న హోటల్లో చేదోడువాదోడుగా ఉంటూనే వివిధ దేశాలకు చెందిన నాణేలు, నోట్లు, మెడల్స్ తదితరాలను సేకరిస్తున్నాడు.
పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.