బాణసంచా దుకాణాల వద్ద జాగ్రత్తలు పాటించాలి
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:34 PM
మదనపల్లె డివిజనలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న తాత్కా లిక బాణసంచా దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ సూచించారు.
మదనపల్లె టౌన, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): మదనపల్లె డివిజనలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న తాత్కా లిక బాణసంచా దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ సూచించారు. సోమవా రం సాయంత్రం స్థానిక సబ్‌కలెక్టరేట్ లో పోలీసు, రెవెన్యూ, విద్యుత, ఫైర్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ నివాస ప్రాంతాలకు, పెట్రోల్ బం కులకు దూరంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. లైసెన్సులు పొందిన వారు మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీఎస్పీ కొండయ్య నాయుడు మా ట్లాడుతూ దుకాణాలు ఏర్పాటు చేసే మైదానానికి రెండు ప్రవేశమార్గాలు ఉండేలా చూసుకో వాలన్నారు. ఫైర్ ఆఫీసర్ శివన్న మాట్లాడుతూ దుకాణాల మధ్య మూడు మీటర్ల దూరం పాటించాలని, రెండు అగ్నిమాపక నిరోధక పరికరాలు ఏర్పాటు చేసుకోవాల న్నారు. ప్రతి దుకాణం వద్ద 200 లీటర్ల నీరు నిల్వ ఉండేలా డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాల న్నారు. ఎస్పీ డీసీఎల్ ఏఈ చంద్రమౌళి మాట్లాడుతూ బాణసంచా దుకాణాల వద్ద విద్యుత తీగలు షార్టుస ర్క్యూట్ లేకుండా ఇన్సులేషన చేయించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్‌లు నిర్మలాదేవి, ధనంజేయులు, సీఐలు చాంద్‌బాషా, రామచం ద్ర, రాజారెడ్డి, రాజారమేష్, ఖాజాభీ, బాణసంచా దుకాణదారులు పాల్గొన్నారు.
నివాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటు వద్దు
సబ్‌కలెక్టర్‌కు అర్జీల వెల్లువ
మదనపల్లె టౌన, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): మదనపల్లె పట్టణంలో కొన్ని చోట్ల నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పా టు చేశారని వాటిని అక్కడ నుంచి తొలగిం చాలని ప్రజలు సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్సడేలో 93 మంది అర్జీలు అందజేశారు. ఈ సంద ర్భంగా బాపూజి పార్కు ప్రాంతవాసులు మా ట్లాడుతూ గతంలో కూడా బాపూజీ పార్కు ఎదుట మద్యం దుకాణం ఏర్పాటు చేసినప్పుడు తమ ఫిర్యాదు మేరకు అప్పటి సబ్‌కలెక్టర్ అక్కడ మద్యం దుకాణాన్ని నిరాకరించారన్నారు. కాని ప్రస్తుతం మళ్లీ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వలన మహిళలు, చిన్నపిల్లలు మద్యం బాబులతో వేగలేకపోతున్నామన్నారు. క్షేత్రస్థాయి పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని కోరా రు. సబ్‌కలెక్టరేట్ ఆవరణలోని చింత చెట్టు కూలి తమ తండ్రి చంద్రశేఖర్ రెండు కాళ్లు విరిగి పోయాయని, పేదలైన తమకు మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని భార్గవి సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు. మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ కాశీరావుపేట వద్ద అన్నదాన సత్రంకు గతంలో స్థలం కేటాయించారని, ఇప్పుడు ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నా రని రైతు కృష్ణమూర్తి ఫిర్యాదు చేశాడు. తన భూమిని ఆక్రమించుకుని తనపైనే దౌర్జన్యం చేస్తున్నారని కురబలకోట మండలం కృష్ణారెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణప్ప ఫిర్యాదు చేశాడు. ప్రతి అర్జీదారుడి సమస్యను తెలుసుకున్న సబ్‌కలెక్టర్ సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. విచారించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.