Home » Araku valley
సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
Andhrapradesh: అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. గత రాత్రి అరకులోయ మండలంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింహాద్రి (28)ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్ద రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఉండే గర్భిణి మహిళలు అష్టకష్టాలు పడి మరీ బిడ్డలకు జన్మనిస్తున్నారు.