Share News

Hyderabad: మే నెలలో మిస్‌ వరల్డ్‌ పోటీలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:39 AM

పోటీలకు హైదరాబాద్‌ వేదిక సిద్ధమవుతోంది. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్ర పర్యాటక శాఖ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది.

Hyderabad: మే నెలలో మిస్‌ వరల్డ్‌ పోటీలు

  • 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం.. 31న ఫినాలే

  • 120 దేశాల నుంచి పోటీదారుల ఆగమనం

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ సుందరి(మిస్‌ వరల్డ్‌)’ పోటీలకు హైదరాబాద్‌ వేదిక సిద్ధమవుతోంది. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్ర పర్యాటక శాఖ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది. పోటీదారులు, న్యాయ నిర్ణేతలు, మీడియా తదితర ప్రతినిధులకు సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు కార్యక్రమానికి సంబంధించి అధికారిక షెడ్యూల్‌ను వెల్లడించారు. మే 7 నుంచి 31 వరకు 28 రోజుల పాటు ప్రపంచ సుందరి పోటీల కార్యక్రమం ఉంటుందని మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది. మే 31న మిస్‌ వరల్డ్‌ ఫినాలే ఉంటుంది. ఇందులో విజేతలైనవారు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన జూన్‌ 2న రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.


ఆ రోజుతో పోటీలు ముగుస్తాయి. మే 6, 7 తేదీల్లో 120 దేశాల నుంచి పోటీదారులు, ప్రతినిధుల రాక ఉంటుంది. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. పోటీదారులు నాలుగు బృందాలుగా విడిపోయి మే 12 నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. బుద్ధవనం, చార్మినార్‌, లాడ్‌ బజార్‌, చౌమహల్లా ప్యాలెస్‌, రామప్ప దేవాలయం, కాళోజీ కళా క్షేత్రం, యాదగిరి గుట్ట, పోచంపల్లి గ్రామం, శిల్పారామం, తెలంగాణ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ట్యాంక్‌బండ్‌, అంబేద్కర్‌ విగ్రహ సందర్శన..ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్రాస్ట్రో ఎంట్రాలజీ, యశోద, అపోలో ఆస్పత్రులను సందర్శిస్తారు. మే17న గచ్చిబౌలి స్టేడియంలో క్రీడల ఫైనల్స్‌ ఉంటుంది. మే 22న శిల్పా కళా వేదికలో ట్యాలెంట్‌ ఫైనల్స్‌.. 23న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌సలో హెడ్‌ టు హెడ్‌ ఫైనల్స్‌.. 24న టాప్‌ మోడల్‌ అండ్‌ ఫ్యాషన్‌షో ఫైనల్స్‌.. మే31న మిస్‌వరల్డ్‌ ఫైనల్స్‌ ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:39 AM