Home » Arvind Kejriwal
ఇది పేద ప్రజలకు ఉద్దేశించిన పథకం అయినందున ప్రధాని అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఇది పూర్తయిన తర్వాత మిగితా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయవచ్చునని అన్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకర్గంలో శనివారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాము ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేకపోయినట్టు కేజ్రీవాల్ చెప్పారు.
బీజేపీ 'గూండాలే' ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ ఒక ట్వీట్లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.
బీజేపీ ఇచ్చిన హామీలు 'ఆమ్ ఆద్మీ పార్టీ' నుంచి కాపీ కొట్టారని, తమ పార్టీ ఎంచుకున్న మార్గానే వాళ్లు అనుసరించేటప్పుడు ఏమాత్రం విజన్ లేని బీజేపీని ఎందుకు ఎన్నుకోవాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు బస్సు ఛార్జీలు సైతం లేకుండా అవస్థలు పడుతున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై దాడికి ఖలిస్థాన్ అనుకూల సంస్థ కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్(56)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై విచారణ జరిపేందుకు ఈడీకి కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చిందని బుధవారం అధికార వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు ఢిల్లీలోనూ, అటు పంజాబ్‌లోనూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తు్న్నాయని, ప్రధానంగా కేజ్రీవాల్‌పై దాడి జరగవచ్చని అనుమానిస్తున్నారు.
'ఇండియా' కూటమి చెక్కుచెదరకుండా ఉండదని అఖిలేష్ తెలిపారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఆ పార్టీలకు కూటమి మద్దతుగా నిలవాలని నేతలంతా నిర్ణయించారని గుర్తుచేశారు.
కేజ్రీవాల్ తన భార్య, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాని వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి ముందు కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ మందిరంలో సతీసమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.