Delhi Assembly Elections: విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:17 PM
తమ పార్టీ అధికారంలోకి వస్తే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు బస్సు ఛార్జీలు సైతం లేకుండా అవస్థలు పడుతున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ఓటర్లను ఆకట్టుకునేందుకు 'ఉచిత' హామీల జోరు కొనసాగుతోంది. ఈ దిశగా 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) మరో హామీ గుప్పించింది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. సిటీలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడు అరెస్ట్
విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్న తమ పార్టీ తిరిగి ఎన్నికల్లో గెలిస్తే విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు బస్సు ఛార్జీలు సైతం లేకుండా అవస్థలు పడుతున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
మెట్రో రైళ్లలో 50 శాతం రాయితీ.. ప్రధానికి లేఖ
దీనికి ముందు, ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీ కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. రాయితీ వల్ల విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో దీన్ని భరించాలని సూచనలు చేశారు. ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య సంయుక్త ప్రాజెక్టు అని కేజ్రీవాల్ గుర్తుచేశారు.
త్రిముఖ పోటీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రాగాలని ఆప్ పట్టుదలగా ఉండగా, ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ పావులు కదపుతోంది. బీజేపీ, ఆప్ రెండూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది. ఫిబ్రవరి 5న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Kumbh Mela 2025: కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి.. వివరాల కోసం కాల్ చేయండి..
Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Read Latest National News and Telugu News