Arvind Kejriwal: ఆ 3 హామీలు అమలు చేయలేకపోయా.. ఒప్పుకున్న కేజ్రీ
ABN , Publish Date - Jan 18 , 2025 | 08:36 PM
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకర్గంలో శనివారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాము ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేకపోయినట్టు కేజ్రీవాల్ చెప్పారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు తాను ఇచ్చిన 3 హామీలను నిలబెట్టుకోలేకపోయానని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అంగీకరించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఆ హామీలను సంపూర్ణంగా నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకర్గంలో శనివారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాము ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేకపోయినట్టు చెప్పారు.
Kejriwal Car Attacked: కేజ్రీవాల్‌పై దాడి, భగ్గుమన్న ఆప్.. తిప్పికొట్టిన బీజేపీ
''యమునా జలాల ప్రక్షాళన మొదటిది. స్వచ్ఛమైన తాగునీరు అందించడం రెండవది. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా రాజధాని రోడ్లను తీర్చిదిద్దడం. ఈ మూడింటిని నెరవేర్చలేకపోయాను. అయితే, ఇందుకు సంబంధించి చాలా వర్క్ చేశాం. వచ్చే ఐదేళ్లలో ఈ మూడు హామీలను నెరవేరుస్తాం" అని కేజ్రీవాల్ తెలిపారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఇళ్లలో అద్దెకుంటున్న వారికి కూడా ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని ప్రకటించారు. తాను ఎక్కడకు వెళ్లినా అద్దె ఇళ్లలో ఉంటున్న ప్రజానీకం తమకు మంచి పాఠశాలు, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అందుతున్నప్పటికీ ఉచిత విద్యుత్, నీటి పథకాలు అందడం లేదని చెబుతున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత తప్పని సరిగా వారికి ఆ పథకాలు అందేలా చేస్తామని, ముఖ్యంగా ఎక్కువ మంది నివాసం ఉంటున్న పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన టెనెంట్స్‌కు ఇందువల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. జాతీయ స్థాయిలో "ఇండియా'' కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేస్తు్న్నాయి. 'ఇండియా' కూటమి భాగస్వాములైన సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఇప్పటికే ఆప్‌కు మద్దతు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్.. విషయం ఏంటంటే..
Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ
Read Latest National News and Telugu News