Home » Atchannaidu Kinjarapu
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కళావతమ్మ మృతి చెందారు. ఆమె మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడ నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కళావతమ్మ మృతి బాధాకరమన్నారు.
Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ (TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ(YCP) ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేస్తుంది.
నేడు విధ్వంస జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని ఏపీ తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సామాజిక-సంక్షేమ విప్లవం తెలుగుదేశంతోనే సాధ్యమని చెప్పారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ కలిగింది. స్కిల్ కేస్‌లో ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
వాలంటర్లపై టీడీపీ నతే బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy) చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి(Srikalahasti) నియోజకవర్గంలో మాట్లాడిన బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.
Andhrapradesh: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తీవ్రంగా ఖండించింది. విశాఖకు డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారంటూ మండిపడ్డారు. శనివారం మూడు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేస్తామంటే అందరూ మోసపోయారని... చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మర్చారంటూ ఏపీ తెలుగు దేశం పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటు తనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ వికలాంగుడంటూ ప్రభుత్వ సలహాదారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోతున్నా రన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయన్నారు. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.