Minister Atchannaidu: నష్టపోయిన ప్రతి రైతుకు అండగా టీడీపీ..
ABN , Publish Date - Jul 29 , 2024 | 12:14 PM
తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిలి లంకలో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు (Crop fields), బొబ్బిలి లంకలో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లా (Godavari District)లో పంట నష్టాన్ని (Crop Loss) అంచనా వేశామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం 40 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు నివేదిక వచ్చిందని, మొత్తం అంతా తిరిగానని, ఇంకా ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. అందుచేత మరోకసారి పంట నష్టంపై రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకు టీడీపీ (TDP) అండగా ఉంటుందని.. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి రైతలకు సహాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం తప్పిదాల వల్ల కాలువ పూడిక తీయకపోవడం, స్లూయిస్ మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రైతులకు నష్టం ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలు ఏమంటున్నారంటే.. తమకు పరిహారం, విత్తనాలు వద్దని, శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారని అన్నారు. దీనిపై నిపుణులను నియమించి శాశ్వత వరద నివారణ చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.,)లో గత ఐదేళ్లలో జలవనరుల శాఖ (Water Resources Dept.,) తీవ్ర నిర్లక్ష్యమైందని, ఇప్పుడు ఆ శాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
కాగా నిడదవోలు ఎర్ర కాలువ ముంపు వల్ల తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన పంట పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌లతో కూడిన మంత్రుల బృందం ఉండ్రాజవరం, నిడదవోలు మండల్లాల్లోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించింది. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పంట నష్టం వివరాలను మంత్రులకు వివరించారు. తాళ్లపాలెం గ్రామంలో వరద ముంపు వల్ల ఇళ్లలోకి నీరు చేరడంతో నష్టపోయిన బాధితులకు మంత్రులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జైపాల్ రెడ్డి సంస్మరణ సభ దృశ్యాలు..(ఫోటో గ్యాలరీ)
ప్రజలు ఛీ కొట్టిన వాళ్ల బుద్ధి మారలేదు..
విశాఖ మేయర్ సీటుపై ఎన్డీయే కన్ను...!
వైఎస్ జగన్‌కు అసలు మ్యూజిక్ స్టార్ట్...
సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News