Home » Banks
నేడు క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేకపోయినా మొత్తం లిమిట్ ఉపయోగించుకుంటే, నెల అయ్యే సరికి వాయిదా కట్టే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్‌దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్‌తో పెన్షన్‌దారులు నీరసించిపోతున్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్‌దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్‌దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
పర్సనల్ లోన్స్(personal loans) వీటిని అనేక మంది ఉద్యోగులు ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాధారణంగా లోన్స్ అవసరమైనప్పుడు మొదట బ్యాంకు వైపు చూస్తారు. ఎందుకంటే బ్యాంకులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తాయి. కానీ ఈ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఎందుకు తీసుకోవద్దని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆదివారం, సెలవు దినాలు వచ్చాయంటే బ్యాంకులు పని చేయవు. అదీ మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31 ఆదివారం వచ్చింది. అయితే బ్యాంకులు సెలవు అని అందరూ అనుకోవచ్చు. కాని ఈ మార్చి 31 ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న డబ్బును కట్టడి చేయడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాంకులకు ఈసీ కొన్ని సూచనలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి.
Credit Card New Rules April 1st: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు..
భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ఆపదలో ఆదుకుంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొంతమంది స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్‌తో కూడుకున్నది కావడంతో.. పేద, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎంపిక చేసుకున్న టైమ్ పీరియడ్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది.
Telangana: అన్నం పెట్టిన బ్యాంకునే కన్నం వేశారు ఆ బ్యాంకు మేనేజర్లు. లోన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మరీ మోసానికి పాల్పడుతూ దాదాపు రూ.2.80 కోట్లు కాజేశారు. ఈ ఘటన నగరంలోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు మేనేజర్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.