Home » Bhadrachalam
భారీ వర్షానికి ఇంటిగోడ కూలి ఒక వృద్ధురాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో వరదనీటిలో పడి మరో వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు.
ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు రింగ్ బండ్కు భారీ గండి పడింది.
మావోయిస్టులు తమ బిడ్డను అన్యాయంగా చంపారని మావోయిస్టు రాధ బంటి (పల్లెపాటి) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన.. బుధవారమంతా కొనసాగింది. కొన్ని చోట్ల అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిర ఈశాన్య మండపం కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన మండపాన్ని కూల్చివేసి పరిస్థితి చక్కదిద్దాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో.. వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి.
కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.
కృష్ణమ్మ శ్రీశైలాన్నీ దాటేసి నాగార్జున సాగర్ దిశగా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో మూడు గేట్లు ఎత్తి, దిగువకు నీటిని వదిలిపెట్టారు. సాగర్లోకి 1.62లక్షల క్యూసెక్కుల నీరు వెళుతోంది.