Home » Bhatti Vikramarka
ఖమ్మం జిల్లా: మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, అయ్యవారిగూడెంలో 6.50 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు.
లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. కొత్త నోటిఫికేషన్లకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోంది. వారం రోజుల్లో 11 వేల పోస్ట్‌లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు(73) నేడు అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో వెంకటేశ్వర్లు బాధపడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు
ఇవాళ ఉదయం 9 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1లో కేబినెట్ భేటీ జరిగింది. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ రాష్ట్ర హోం మంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బడ్జెట్లో బీసీ సంక్షేమం కోసం 20 వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పిస్థామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో లోక్ సభ ఎన్నికల కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది.
Telangana: తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. బుధవారం సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజాయుద్ధనౌక గద్దర్ సమాధి వద్దకు భట్టి చేరుకుని నివాళులర్పించారు.
Telangana: మేడిగడ్డపై సంబంధిత మంత్రి స్పందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా భవన్లో ఎవరైనా రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవొచ్చని అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
Telanagana: భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. డిప్యూటీ సీఎం వెంట ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ ఐఏఎస్, ఓఎస్డీ కృష్ణ భాస్కర్ ఉన్నారు. ఉదయం 11:10 నిమిషాలకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం చేరుకోనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్న విద్యుత్ అవసరమని..