Share News

TS Polls 2024: ఫలించిన డీకే వ్యూహం.. నేడే ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:16 PM

చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద నలుగుతున్న మూడు స్థానాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేటికీ పెండింగ్‌లో పెట్టింది. ఆయా స్థానాల్లో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికి కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు.

TS Polls 2024: ఫలించిన డీకే వ్యూహం.. నేడే ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్: తెలంగాణలో 14 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ (Congress Party) మూడు స్థానాలను మాత్రం చాలా రోజులుగా పెండింగ్‌లోనే పెట్టేసింది. టికెట్ల కోసం పోటాపోటీగా ఉండటంతో ఎవరికి టికెట్లు ఇవ్వాలో.. ఎవర్ని పక్కనెట్టాలో తెలియక హైకమాండ్‌కు పెద్ద తలనొప్పే అయ్యింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికి కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో ఆయా స్థానాలపై చిక్కుముడి వీడలేదు. ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగడంతో ఈ మూడు స్థానాలపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. దీంతో ఇవాళ సాయంత్రం మూడు సీట్లకు అభ్యర్థులను ఏఐసీపీ ప్రకటించనుంది.

YSRCP: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్


DK-Sivakumar.jpg

ఫలించిన వ్యూహం!

డీకే శివకుమార్ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. సోమవారం నాడు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో డీకే మంతనాలు జరిపారు. డీకే చెప్పడంతో భట్టి, పొంగులేటి ఇద్దరూ వెనక్కి తగ్గారు. దీంతో ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగిందని తెలుస్తోంది. అయితే.. ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు అనేది తెలియట్లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పొంగులేటి సోదరుడేనని తెలుస్తోంది. ఇక కరీంనగర్ టికెట్ వెలమ సామాజిక వర్గానికి కేటాయించినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లా ఖాన్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. నేరుగా ఎలక్షన్ కమిషన్‌కి కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలు పంపనున్నట్టు సమాచారం. ఈ ప్రకటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.

Bhatti-And-Ponguleti.jpg

ఇవి కూడా చదవండి...

Business Idea: ఉద్యోగం వదిలి పశుపోషణ.. నెలకు లక్షకుపైగా ఆదాయం

AP Elections: పాలకొండ అసెంబ్లీ ఆర్‌వోను తక్షణం బదిలీ చేయండి.. ఈసీ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 12:47 PM