Loksabha Elections: బెంగళూరు చేరిన ఖమ్మం పంచాయితీ
ABN , Publish Date - Apr 22 , 2024 | 11:12 AM
ఖమ్మం లోక్‌సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.
హైదరాబాద్: ఖమ్మం లోక్‌సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయతీ కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వద్దకు పంచాయతీ చేరింది. సాయంత్రం లోగా ఖమ్మం సీటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
TS Politics: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్
ఖమ్మం సీటు విషయం ఎప్పటి నుంచో నలుగుతోంది. ముగ్గురు హేమాహేమీలు మాకంటే మాకు ఇవ్వాలంటూ పట్టుబడుతూ ఉండటంతో ఈ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెండింగ్ పెడుతూ వచ్చింది. ఇతర పార్టీల అభ్యర్థులు ఇప్పటికే జిల్లా అంతటా తిరుగుతూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించేందుకే నానా తంటాలు పడుతోంది. దీనికి కారణంగా ఖమ్మం డిప్యూటీ సీఎం సహా మంత్రి పొంగులేటి తమ వారి కోసం సీటు కేటాయించాలంటూ పట్టుదలగా ఉండటమే. ఎవరికి కేటాయిస్తే ఎవరితో తంటానోనని కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్‌ను పెండింగ్‌లో పెడుతూ వస్తోంది.
ఇవి కూడా చదవండి...
Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?
Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం